“100 కోట్ల వ్యాక్సిన్” పబ్లిసిటీకో ధీమ్ సాంగ్ రెడీ !

వ్యాక్సిన్లకు పబ్లిసిటీ చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వానికి వినూత్నమైన ఆలోచనలు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయో చెప్పడం కూడా కష్టం. చివరికి ప్రపంచ దేశాలు మొత్తం ఆశ్చర్యపోయేలా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల మీద  మోడీ బొమ్మ ప్రముఖంగా కనిపిస్తోంది. అదే కాదు వ్యాక్సిన్ విషయంలో ప్రతి మైల్ స్టోన్ దగ్గరా ఓ ప్రచార చిత్రం రూపుదిద్దుకుంది. ఇక మోడీ పుట్టిన రోజుకు వ్యాక్సిన్ ఫెస్టివల్ నిర్వహించేశారు. ఇప్పుడు జనాలకు వంద కోట్లవ వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారట. ఇక ఊరుకుంటారా..?

బాలీవుడ్ సింగర్ ను రంగంలోకి దింపారు. ఆయనతో ఓ హుషారైన పాటను పాడించారు. ఆ సింగర్ పేరు ఖైలాష్ ఖేర్. ఈయన సూపర్ సింగర్. తెలుగులోనూ టాప్ హీరోలకు పాడి సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. ఈ ఖేర్‌తో పాటను పాడించారు. ఈ పాటను 100 కోట్ల డోసులు పూర్తయ్యాక విడుదల చేస్తారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ కంపెనీలు ఈ పాటకు ఫండింగ్ చేశాయి. బహుశా సీఎస్ఆర్ ఫండ్స్ తోనే అయి ఉంటుంది.

ఒక్కసారి వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్కును దాటాక రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ స్టాండ్లలో ఈ థీమ్ సాంగ్ ప్లే చేయనున్నారు. సోమవారం నాటికి 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరుకుంటామని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ పాట  కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా అవగాహన కోసం రూపొందించామని కేంద్రం చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close