బ‌న్నీ డెడ్ లైన్ 100 రోజులు

హిట్టూ, యావ‌రేజ్ మ‌ధ్య ఊగిస‌లాడిన సినిమా పుష్ప‌. డివైడ్ టాక్ వ‌చ్చినా, వ‌సూళ్ల హ‌వా త‌గ్గ‌లేదు. ముఖ్యంగా బీ,సీల‌లో పుష్ప‌కి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. ఇప్పుడు పుష్ప 2 వంతు. పుష్ప 2 ఉంటుందా, లేదా? అనే సందిగ్థానికి తెర ప‌డింది. ఫిబ్ర‌వ‌రి నుంచి పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. స్క్రిప్టు సిద్ధంగా ఉండ‌డంతో.. సుకుమార్ ఈసారి పెద్ద‌గా స‌మ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కాక‌పోతే… బ‌న్నీ సుక్కుకి డెడ్ లైన్ విధించేశాడు. వంద రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాల‌ని టార్గెట్ ఫిక్స్ చేశాడు. 2022 ద‌స‌రాకి.. పుష్ప 2 రావాలి. ఇదీ… సుకుమార్ ల‌క్ష్యం.

పుష్ప 2 కి సంబంధించి రెండంటే రెండే సీన్లు తెర‌కెక్కించారు. అంటే దాదాపుగా సినిమా మొత్తం తీయాలి. బ‌న్నీ కాల్షీట్లు రెడీగానే ఉన్నాయి. మిగిలిన వాళ్ల కాల్షీట్లు దొర‌కాలి. ఫ‌హ‌ద్ ఫాజిల్ కి సంబంధించి ఎక్కువ డేట్లు అవ‌స‌రం. త‌నుమ‌ల‌యాళంలో బిజీ స్టార్‌. త‌న కాల్షీట్ల వెసులుబాటుని బ‌ట్టి.. పుష్ప షూటింగ్ వేగం ఆధాప‌డి ఉంటుంది. పుష్ప 2 స్క్రిప్టు రెడీగా ఉన్నా, కొన్ని మార్పులు చేర్పులూ అవ‌స‌రం అవుతున్నాయ‌ని స‌మాచారం. ముఖ్యంగా బ‌న్నీ – ర‌ష్మిక‌ల మ‌ధ్య ట్రాక్ కి పుష్ప 2 లో అవ‌కాశం లేకుండా పోయింద‌ని, దాన్ని మ‌ళ్లీ రాయ‌ల్సివ‌స్తోంద‌ని స‌మాచారం. పుష్ప 2లో మ‌ద‌ర్ సెంటిమెంట్ మ‌రింత బాగా ద‌ట్టించార్ట‌. ఆ డోసు త‌గ్గించే అవ‌కాశం ఉంది. కొన్ని `రా` సీన్ల‌ను.. సెటిల్డ్ గా రాసుకోవాలని, దానికి సుకుమార్ కి కొంత స‌మ‌యం ప‌ట్ట‌బోతోంద‌ని టాక్‌. బ‌న్నీ ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కూ షూటింగ్ కి రాన‌ని చెప్పేశాడ‌ట‌. సో.. అప్ప‌టి వ‌ర‌కూ స్క్రిప్టులో రిపేర్లు చేసుకునే వీలుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close