‘ఆదిత్య 369’కి మోడ్ర‌న్ వెర్ష‌న్‌

టాలీవుడ్ లో టైమ్ ట్రావెల్ క‌థ‌లు ఎక్కువ అవుతున్నాయి. ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కాంబోలో రాబోతున్న `ప్రాజెక్ట్ కె` టైమ్ ట్రావెల్ కి సంబంధించిన క‌థే అని టాక్‌. ఇప్పుడు యువ ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యాన్ కూడా అలాంటి క‌థే రాశాడ‌ట‌. `టాక్సీవాలా`తో ఆక‌ట్టుకున్న రాహుల్‌.. నానిని `శ్యామ్ సింగ‌రాయ్‌`గా చూపించిన సంగ‌తి తెలిసిందే. పెద్ద కాన్వాస్ ఉన్న క‌థ‌ని జాగ్ర‌త్త‌గా హ్యాండిల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. రాహుల్ టెక్నిక‌ల్ గా సౌండ్ అని ఈ సినిమాతో అర్థ‌మైంది. ఇప్పుడు మైత్రీ లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు రాహుల్. అది టైమ్ ట్రావెల్ కి సంబంధించిన క‌థ అని తెలుస్తోంది. హీరో భూత‌, భ‌విష్య‌త్ కాలాల‌కు ఎలా వెళ్లాడు? అక్క‌డ ఏం చేశాడ‌న్న‌ది క‌థ‌. ఓ ర‌కంగా చెప్పాలంటే ఆదిత్య 369కి మోడ్ర‌న్ వెర్ష‌న్ అన్న‌మాట‌. మైత్రీలో చాలామంది ద‌ర్శ‌కులు అడ్వాన్సులు తీసుకున్నారు. వాళ్లంతా క‌థ‌లు త‌యారు చేసుకునే ప‌నిలో ఉన్నారు. కానీ హీరోలే దొర‌క‌డం లేదు. మ‌రి… రాహుల్ సంకృత్యాన్ కి ఏ హీరో దొరుకుతాడో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో వైఎస్ ఓటు బ్యాంక్ చెరో ఓటు ట్రెండ్ – అవినాష్ పుట్టి మునిగినట్లే !

కడపలో అవినాష్ రెడ్డి పుట్టి మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కడపలో వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించేవారు ఎవరూ ఆ కుటుంబానికి ఓటేసే అవకాశం లేదు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించేవారు మాత్రం ఈ...

మంగళగిరిలో ఓటుకు నాలుగు వేలు..!?

కుప్పం.. మంగళగిరి.. పిఠాపురం.. ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. కారణం అక్కడ చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లు పోటీ చేస్తుండటమే. దీంతో వారిని ఎలాగైనా ఓడించాలని...

సజ్జల భార్గవ, వైసీపీ సోషల్ మీడియా టీంపై సీఐడీ కేసులు !

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారంటే ఏంటో వైసీపీ సోషల్ మీడియా, వాటి ఇంచార్జ్ సజ్జల భార్గవను చూస్తే అర్థమైపోతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై కేసులు...

ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కేనా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close