‘హీరామండి’ వెబ్ సిరిస్ రివ్యూ: నయనానందమే కానీ…

Heeramandi Web Series Review

సంజయ్ లీలా భన్సాలీ.. ఇండియన్ సినిమాలో పరిచయం అవసరం లేని దర్శకుడు. భారీదనం ఉట్టిపడే కళాత్మక చిత్రాలతో పేరుతెచ్చున ఆయన ఇప్పుడు వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టారు. ఆయన దర్శకత్వంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వెబ్ సిరిస్ ‘హీరామండి’. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఇతివృత్తంగా ఈ సిరిస్ ని తెరకెక్కించారు. మరి ఇందులోని సంఘటనలు ప్రేక్షకులని అలరించాయా? స్వాతంత్య్ర పోరాటంలో హీరామండి పాత్ర ఏమిటి? ఇప్పటివరకూ చరిత్రలో పెద్దగా చెప్పుకోని ఈ గాధ‌ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?

క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న కాలం. లాహోర్‌. అక్కడి వేశ్య వాటిక షాహీ మహల్‌కు బాస్ మల్లికా జాన్‌ (మనీషా కొయిరాలా). తను క్వీన్ ఆఫ్ హీరామాండి. బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి), ఆలంజేబు (షర్మిన్‌ సెగల్‌) ఆమె కుమార్తెలు. ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా) ఖ్వాభాగ్‌ అనే మరో మహల్‌కు బాస్. మల్లికా జాన్‌, ఫరీదాన్‌ మధ్య దశాబ్దాల‌ వైరం నడుస్తుంటుంది. మల్లికా జాన్‌ ను అంతం చేయాలని చూస్తుంతుంది ఫరీదాన్. మ‌రోవైపు.. బిబోజాన్‌ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర్య పోరాటంలో డిటెక్టివ్ లా పని చేస్తుంటుంది. మరి ఫరీదాన్ కుట్రలని మల్లికా జాన్ ఎలా తిప్పికొట్టింది? అసలు వారి మధ్య వైరానికి గల కారణం ఏమిటి? బిబోజాన్‌ గూఢచర్యం స్వతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించింది? ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది? అనేది తక్కిన సిరిస్.

కథ సింపుల్ గా అర్ధం చేయించడానికి ప్రధాన పాత్రల ఇతివృత్తంతోనే ఇలా చెప్పడం జరిగింది కానీ.. ఈ సిరిస్ లో చెప్పిన కథ, చూపించిన డ్రామా, కనిపించిన పాత్రలు గురించి ప్రస్థావించుకుంటూపొతే అదే పెద్ద చరిత్రైపోతుంది.

స్వాతంత్రం కోసం దేశంలోని ప్రతి వర్గం పరితపించింది. అన్ని వర్గాలు పోరాటంలో భాగమైయ్యాయి. స్వేచ్ఛా వాయుల కోసం ఎందరో శ్వాస విడిచారు. ఈ పోరాటంలో భాగమైన అన్ని వర్గాల గురించి ఎక్కడో అక్కడ, ఎంతో కొంత ప్రస్తావన వుంది కానీ, ఫ్రీడమ్ ఫైట్ లో వేశ్యల త్యాగాలని గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడారా? పుస్తకంగా రాశారా? కథగా చెప్పారా? భన్సాలీని ఇదే ప్రశ్న వెంటాడినట్లుగా వుంది. అందుకే చరిత్రలో పెద్దగా చెప్పుకొని, ప్రస్తావన లేని లాహోర్‌ లోని షాహీ మహల్‌ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలకు తనదైన శైలిలో భారీదనం అద్ది ఎనిమిది ఎపిసోడ్స్ (ఒకొక్క ఎపిసోడ్ నిడివి దాదాపు గంట) గల ఓ మెగా వెబ్ సిరిస్ గా ‘హీరామండి’ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చారు.

మల్లికా జాన్ పాత్రని పరిచయం చేస్తూ కథ మొదలౌతుంది. మల్లికా, ఆ పాత్ర చుట్టూ వున్న మరికొన్ని పాత్రలు, షాహీ మహల్‌, 1942 యాంబియన్స్.. ఇవన్నీ టైం ట్రావెల్ లా అలనాటి పరిస్థితులకు ప్రేక్షుకులని తీసుకెళ్ళిపోతాయి. మల్లికా జాన్ పరిచయం తర్వాత డ్రామా ఆటోమేటిక్ గా ఊపు అందుకుంటుదని భావిస్తే మాత్రం నిరాశ తప్పుదు. ఈ సిరిస్ లో మొదటి ఐదు ఎపిసోడ్లు ఒకొక్క పాత్ర పరిచయానికే పరిమితమైయినట్లుగా అనిపిస్తుంది. మల్లికాజాన్, ఫరీదంజాన్, వహీదాజాన్, అలంజేబ్, తాజ్దార్.. ఇవి మొదటి ఐదు ఎపిసోడ్ల పేర్లు. ఆ టైటిల్ కి తగ్గటే..ఆ పాత్ర చుట్టూ వున్న కథ చెప్పుకుంటూ వెళ్లారు. అయితే కథ చెప్పే క్రమంలో డ్రామాని కావాల్సినదానికంటే ఎక్కువ సాగదీసేశారనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అరగంటలో చెప్పాల్సిన కంటెంట్ ని గంటకి లాగేశారని అర్ధమౌతుంటుంది. వెబ్ సిరిస్ లో డిటైలింగ్‌ అవసరమే కానీ, మ‌రీ…. ఇంత అనవసరమనే భావన చాలాచోట్ల కలుగుతుంది.

ఇక చివరి మూడు ఎపిసోడ్లు మాత్రం డ్రామా రక్తికట్టించారు. “తాజ్దార్ & అలంజేబ్, “బిబ్బోజాన్, చివరి ఎపిసోడ్ “హీరమండి: ది స్వాన్ సాంగ్” లో ప్రేక్షకుడు కొరుకునే వేగం వుంటుంది. అయితే చివరి ఈ మూడు ఎపిసోడ్స్ వరకూ రావాలంటేముందు మొదటి ఐదు ఎపిసోడ్స్ ని ఓపికతో భరించిచాల్సివస్తుంది. అలాగని ఆ ఎపిసోడ్స్ మరీ బోరింగ్ గా వుండవు. అడుగడుగునా బన్సాలీ భారీదనంతో నిండిపోతు ఎనబై ఏళ్ళు వెనక్కి వెళ్లి ఓ వింటేజ్ వరల్డ్ ని చూస్తున్న అనుభూతిని ఇస్తాయి. కావాల్సినదంతా కాస్త ఓపిక తెచ్చుకొని చూడటమే.

మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కొయిరాలా గుర్తుండిపోయే నటన కనపరిచింది. ఆమెకు ఎదురుగా నిలబడే పాత్రలో సోనాక్షి సిన్హా నటన కూడా ఆకట్టుకునేలా వుంటుంది. అదితిరావు హైదరీ పాత్రలో రెండు కోణాలు వున్నాయి. ఆమె ప్రదర్శించిన నృతం మరో ఆకర్షణ. రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ ఇలా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

టెక్నికల్ గా ఈ సిరిస్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాలీవుడ్ లో వచ్చిన పీకీ బ్లైండర్స్ లాంటి వెబ్ సిరిస్ లు చూస్తున్నపుడు అలాంటి హిస్టారికల్ యాంబియన్స్ ని ఎలా క్రియేట్ చేశారనే ఆలోచన వస్తుంది. బన్సాలి బాలీవుడ్ లో ఈ మ్యాజిక్ చేసి చూపించాడు. ప్రతి ఫ్రేం ని ఒక పెయిటింగ్ లా తీర్చిదిద్దాడు. నటీనటులు వేసుకున్న వస్త్రాలపై తను తీసుకున్న శ్రద్ద ఏమిటో ఈ సిరిస్ చూస్తున్నపుడు అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి ఆర్టిస్ట్ వేసుకున్న నగల బరువు కొన్ని కేజీల్లోనే వుంటుంది. పేరుకు తగ్గట్టు ఆ సెట్స్ అన్నీ వింటేజ్ వైబ్ తో వజ్రాల్లా మెరుస్తుంటాయి. ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంటుంది.

సంగీత ప్రధానమైన సిరిస్ ఇది. సిరిస్ మొత్తంలో వినిపించే పాటలు, నేపధ్య సంగీతం చెవికి ఇంపుగా వుంటాయి. కవిత్వం ధ్వనించే మాటలు రాసుకున్నారు. ‘సముద్రానికి ఈత కొట్టాలనిపిస్తే నీ కళ్ళల్లోకి దూకేస్తుంది”లాంటి ఉపమానాలు ఎన్నో భలే గమ్మత్తుగా వినిపిస్తుంటాయి. కెమరాపనితనం బన్సాలి మార్క్ లో రిచ్ గా వుంది. ఇంత భారీ నిర్మాణంతో వచ్చిన బాలీవుడ్ సిరిస్ ఇదే కావచ్చు. వేశ్య వాటికలు చుట్టూ నడిచే కథ ఇది. శ్రుతి మించిన శ్రుంగార దృశ్యాలు నింపే అవకాశం ఉన్న కంటెంట్. కానీ బన్సాలి ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇందులోని పాత్రల పాదాలు కూడా కనిపించనివ్వకుండా చేసిన వస్త్రధారణలో బన్సాలి మార్క్ కనిపిస్తుంది. సన్నివేశాలకు అవసరమైన ఎరోటిక్ సీన్స్ ఉన్నప్పటికీ అవి శ్రుతిమించలేదు.

మొత్తంగా సిరిస్ కొన్ని చోట్ల నయనానందంగా వుంటుంది. మరికొన్ని చోట్ల శ్రవణానందంగా వుంటుంది. మరికొన్ని చోట్ల కవితాత్మకంగా వుంటుంది. ఐతే ఈ రసానుభూతిని పొందాలంటే ప్రేక్షకుడిలో ఓపిక వుండాలి. బన్సాలి అభిరుచికి అభిమానులైవుండాలి. అప్పుడే ఈ సిరిస్ ని ఆస్వాదించవచ్చు. లేదంటే ఈ సిరిస్ సహనానికి పరీక్షలా మారే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్.. ముహూర్తం కుదిరింది!

ఎన్టీఆర్ త‌దుప‌రి సినిమా ఏమిట‌న్న విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వంలో ఎన్టీఆర్ తో మైత్రీ మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. 'దేవ‌ర‌' త‌ర‌వాత ఎన్టీఆర్ న‌టించే...

“డిపార్టుమెంట్”పై నమ్మకం మళ్లీ ఎలా పెంచుకోగలరు !?

నేరపూరిత మనస్థత్వం ఉన్న వ్యక్తి చేతుల్లోకి న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు వెళ్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో గత ఐదేళ్లుగా ఏపీ చూసింది. బాధితులు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఒక్క...

ఈవారం బాక్సాఫీస్‌: ప్రేక్ష‌కుల మూడ్ మారుతుందా?

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల ఫీవ‌ర్ తో వ‌ణికిపోయారు తెలుగు ప్రజ‌లు. దాంతో సినిమాల గురించి పెద్ద‌గా పట్టించుకొనే స‌మ‌యం దొర‌క‌లేదు. బాక్సాఫీసు ముందుకు చిన్నా, చిత‌కా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటికి ఆద‌ర‌ణ క‌రువైంది....

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close