‘క‌న్న‌ప్ప‌’ సెట్లో బాహుబ‌లి

మంచు విష్ణు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘క‌న్న‌ప్ప‌’. ఈ సినిమాలో సౌత్ ఇండియ‌న్ స్టార్ల‌తో పాటు, బాలీవుడ్ స్టార్లు కూడా అతిథి పాత్ర‌ల్లో మెర‌వ‌బోతున్నారు. అక్ష‌య్‌కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న షూటింగ్ పార్ట్ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు ప్ర‌భాస్ వంతు వ‌చ్చింది. ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడిగా న‌టించ‌బోతున్నాడ‌ని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ప్ర‌భాస్ ‘క‌న్న‌ప్ప‌’ సెట్లో కూడా అడుగు పెట్టారు. ఈనెల 7 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌భాస్ పై కీల‌క సన్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. మ‌రో నాలుగు రోజులు ఈ షూటింగ్ కొన‌సాగే అవ‌కాశం ఉంది. దాంతో… ‘క‌న్న‌ప్ప‌’ దాదాపుగా పూర్త‌వుతుంది. ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కోసం ఎక్కువ రోజులు స‌మ‌యం కేటాయించారు. ‘క‌న్న‌ప్ప‌’ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర‌వాత ప్ర‌భాస్ ‘రాజాసాబ్‌’కు డేట్లు కేటాయిస్తారు. ‘రాజాసాబ్‌’ షెడ్యూల్ అయిన వెంట‌నే ప్ర‌భాస్ ఇట‌లీ వెళ్తారు. అక్క‌డే ఆయ‌న వేస‌వి విడిది. అక్క‌డ్నుంచి తిరిగి వ‌చ్చాక ‘రాజాసాబ్‌’ తో పాటుగా ‘స‌లార్ 2’ సెట్లో పాలు పంచుకోనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ మంత్రుల పేషీల నుంచి ఒక్క ఫైల్ బయటకు పోకుండా తాళాలు !

తెలంగాణలో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రుల కార్యాలయాల నుంచి కీలక ఫైళ్లు వాహనాల్లో తీసుకెళ్లిన విషయం గగ్గోలు రేగింది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ...

చిహ్నంలో భాగ్యలక్ష్మి టెంపుల్… బండి ట్వీట్ సారాంశం ఇదేనా..?

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా బీజేపీ ఎలాంటి వైఖరిని ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాలన్నీ ఈ అంశం చుట్టూనే తిరుగుతుంటే బీజేపీ మాత్రం మౌనం...

డేరాబాబా నిర్దోషి – అన్యాయంగా జైల్లో పెట్టేశారా !?

డేరాబాబా గురించి కథలు కథలుగా దేశమంతా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిర్దోషి అని హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. తన మాజదీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో...

సజ్జల అల్లర్ల హింట్ – మీనా అరెస్టుల వార్నింగ్

కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి రేపతామని వైసీపీ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుందని పేర్ని నాని ముందే హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లకు సజ్జల కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close