ఆర్కే పలుకు : మీడియా విశ్వసనీయతపై ఆర్కే ఆవేదన

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకులో తెలుగు మీడియా విశ్వసనీయత కోల్పోతోందని.. ప్రజలు ఎవరూ నమ్మలేని పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేయడానికి కేటాయించారు. చాలా కష్టపడి పేజీ మొత్తం దీని గురించే రాశారు. ఇప్పుడు ఏ మీడియా ఏ పార్టీక చెందిందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని చెప్పుకొచ్చారు.

ఆర్కే ఆవేదనలో అర్థం ఉంది.. నిజానికి ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. దేశవ్యాప్తంగా మీడియా విశ్వసనీయత కోల్పోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే ప్రతిపక్షానికి దగ్గర అని.. ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తే అధికార పార్టీకి దగ్గర అనే ముద్ర పడిపోతుంది. నిజాలు చెప్పినా అది ప్రతిపక్షానికి దగ్గరే అన్న ముద్ర తెస్తుంది. అది ట్రెండ్. ఈ విషయం ఆర్కేకి తెలియనిదేం కాదు కానీ… ఇప్పుడు ఎందుకు ఆయన అంత ఆవేశం చెందాల్సి వచ్చిందంటే… సోషల్ మీడియాలో వైసీపీ గెలుస్తుందని కొంత మంది జర్నలిస్టులు, కమ్యూనిస్టుల పేరుతో చేస్తున్న విశ్లేషణలు.

పోలింగ్ సరళి, ఉద్యోగుల ఓట్లు ఇలా ఎన్ని తీసుకున్నా జగన్ రెడ్డికి ప్లస్ గా ఒక్కటీ లేదని అయినా ఆయనే గెలుస్తాడని కొంత మంది సోషల్ మీడియా జర్నలిస్టులు ఉదరగొడుతున్నారు. వైసీపీ ఎన్నికలకు ఆరకు నెలల ముందు నుంచి కనీసం మాజీ జర్నలిస్టులు పెట్టుకున్న 200 యూట్యూబ్ చానల్స్ కు ఊహించలేనంత నెలవారీ పేమెంట్లు ఇచ్చిందని మీడియా సర్కిల్స్ లో అందరికీ తెలుసు. వారి పేమెంట్ కు తగ్గట్లుగా వారు న్యాయం చేస్తారు. కానీ ఆర్కే వారి వల్ల మీడియా విశ్వసనీయత తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారి సంగతేమో కానీ ఇద్దరి విషయంలో ఆయన బాగా డిజప్పాయింట్ అయ్యారని ఆర్టికల్ ప్రత్యేకంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అందులో ఒకరు ఏబీఎన్ చానల్ లో నెట్ వర్క్ ఇంచార్జ్ గా పని చేసి…బయటకు పోయి ఈహా అనే యూట్యూబ్ చానల్ పెట్టుకుని వైసీపీ భజన చేస్తున్న జర్నలిస్టులు, ఇంకొరు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఫలితాల తర్వాత వీరు తల ఎక్కడ పెట్టుకుంటారని ఆర్కే ఇందులోనే ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి సోషల్ మీడియా విశ్లేషణలపై వ్యతిరేకంగా రాస్తున్నందుకేమో కానీ.. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబే గెలుస్తాడని ఆర్కే ఎక్కడా చెప్పలేదు. కానీ జగన్ కు జీరో చాన్స్ ఉందని మాత్రం విశ్లేషించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్నది గుర్తుంచుకుని విశ్లేషణ చేయాలని ప్రతి జర్నలిస్టు గుర్తుంచుకోవాలని కూడా.. సీనియర్ జర్నలిస్టుగా ఆర్కే తన ఆర్టికల్ ద్వారా… తోటి జర్నలిస్టులకు సందేశం పంపారు. కానీ రేపు ఫలితాల తర్వాత ఆ జర్నలిస్టుల విశ్లేషణలు తప్పు అయినా వారే పట్టించుకోరు… మరొకరు డబ్బులిస్తే.. వారి తరపున ఎనాలసిస్ చేస్తారు. ఈ విషయం తెలిసి కూడా ఆర్కే ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నట్లు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close