రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను ట్రోల్ చేస్తోంది. వైసీపీ టిక్కెట్‌పై గెలిచి నాలుగున్నరేళ్లపై జగన్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని.. ఇప్పుడు తగినశాస్తి జరిగిందని వారంటున్నారు. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని.. ప్రాణాలను కూడా రిస్క్‌లో పెట్టుకుని రఘురామ పోరాడారని.. ఆయన జగన్‌కు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో లేకపోతే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. అయితే పొత్తుల్లో భాగంగా కేటాయించిన సీట్లు.. ప్రకటించిన అభ్యర్థుల ప్రకారం చూస్తే ఆయనకు చాన్స్ లేనట్లే. కానీ రాజకీయాల్లో ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. అందుకే ఇప్పుడు రఘురామ పోటీ ఖాయమన్న సంకేతాలు మళ్లీ వస్తున్నాయి.

రఘురామ పోటీ చేసే అవకాశం

రఘురామ కృష్ణరాజు తాను నర్సాపురం నుంచి పోటీ చేయడం ఖాయమన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్డీఏ కూటమిలోని మూడు పార్టీల మధ్య రఘురామకృష్ణరాజు ఎన్నికల్లో నిలబెట్టే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో ఖచ్చితంగా పోటీ చేయించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయనకు టిక్కెట్ కేటాయించడానికి ఎన్ని సమస్యలు ఉన్నాయో.. సీటును ఖరారు చేయడానికి కూడా అన్నే హార్డిల్స్ ఉన్నాయి. వీటన్నింటికీ కూటమి నేతలు సామరస్యంగా పరిష్కరించుకుంటే రఘురామకు సీటు లభించవచ్చన్నది తాజాగా వినిపిస్తున్నసందేశం.

రఘురామ పోటీకి ఉన్న అవకాశాలు :

రఘురామకృష్ణరాజు పోటీకి అవకాశాలు పూర్తిగా క్లోజ్ కాలేదు. ఇంకా ఉన్నాయి. నర్సాపురం ఎంపీ స్థానం నుంచి రఘురామ కాకుండా భూపతిరాజు శ్రీనివాసవర్మను ఎంపిక చేయడానికి కారణం ఏమిటన్నది అనేది ఇంకా పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రూమర్‌గానే ఉంది. శ్రీనివాస వర్మ అంత పొటెన్షియల్ లీడర్ కాదు. కానీ వైసీపీ ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. పెద్దగా ఎవరికీ తెలియని మహిళా లాయర్‌కు సీటు ప్రకటించారు. ఆ అభ్యర్థిని, పొత్తును బట్టి చూస్తే.. రఘురామ పోటీలో నిలబడితే వార్ వన్ సైడ్ అవుతుంది. ఈ నివేదికలు బీజేపీ దగ్గర కూడా ఉంటాయి. అందుకే శ్రీనివాసవర్మకు సర్ది చెప్పి.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు రఘురామను అభ్యర్థిగా ఖరారు చేయవచ్చన్న సంకేతాలు ఉన్నాయి.

రఘురామకు బీజేపీ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా ఆయనకు టిక్కెట్ రాకపోవడం అనేక గుసగుసలు ఉన్నాయి. రఘురామ తప్ప ఎవర్ని నిలబెట్టినా బీజేపీ సులువుగా గెలిచేలా బలహీన అభ్యర్థిని పెట్టి సహకరిస్తామని ఏపీ అధికార పార్టీ నుంచి అందిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అయితే ఇలాంటి లోపాయికారీ ఒప్పందాలకు బీజేపీ కట్టుబడదు. చివరి రోజు అయినా అభ్యర్థిని మారుస్తుంది.

ఒక వేల పార్లమెంట్ కు సాధ్యం కాకపోతే.. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనను నిలబెట్టే అవకాశం ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ మరో మాజీ ఎమ్మల్యే అసంతృప్తిగా ఉన్నారు. వీరిద్దర్నీ బుజ్జగించి మధ్యే మార్గంగా రఘురామకు ఇచ్చే ఆలోచన ఉందన్న ప్రచారమూ ఉంది. దీనిపై రఘురామ స్పందన స్పష్టత లేదు.

రఘురామ పోటీకి అడ్డుపడే అంశాలు

రఘురామ పోటీ చేయడానికి అడ్డుపడే ప్రధాన అంశం ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించడం. దాదాపుగా అన్ని స్థానాలకు కూటమిలోని అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు సీట్లు మార్పు అంటే.. చిన్న విషయం కాదు. పై స్థాయిలో నిర్ణయం జరగాలి. అదంతా తేలిక కాదు.

రఘురామకు అడ్డుపడే మరో అంశం సీటు సమస్య. రఘురామ నర్సాపురం ఎంపీగా ఉన్నారు. అదే ఆయనకు సిట్టింగ్. మరో స్థానం నుంచి పోటీ చేయడానికి సామాజిక సమీకరణాలు పెద్దగా కుదరవు. అందుకే ఆయన పోటీ చేయలేకపోతే అందులో సీటు కారణం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close