లేడీ గెటప్పులు వేయాలన్న ఆశ.. ప్రతీ హీరోకీ ఉంటుంది. సమయం సందర్భం కలసి రావాలంతే! ఒకప్పటి అగ్ర హీరోలంతా మేకప్పులు మార్చి, శారీలు కట్టి – ఆడ వేషాల్లో అదరగొట్టినవాళ్లే. ఈతరం హీరోలు అడపా దడపా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ లిస్టులోకి విశ్వక్సేన్ చేరిపోయాడు. విశ్వక్ హీరోగా ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు.. ‘లైలా’. ఇందులో హీరో లేడీ గెటప్పులో దర్శనమివ్వబోతున్నాడు. ఈరోజు విశ్వక్సేన్ పుట్టిన రోజు సందర్భంగా.. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. రామ్ నారాయణ్ దర్శకుడు. సాహు గారపాటి నిర్మాత. యాక్షన్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈరోజు విడుదల చేసిన మోషన్ పోస్టర్ ట్రెండీగా, ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ మోషన్ పోస్టర్ చూస్తే.. కథలోని కోణాలు అర్థమవుతుంటాయి. విశ్వక్ ఈమధ్య రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో విజయం కూడా అందుకొంటున్నాడు. ఈతరం హీరోలు లేడీ గెటప్పులు వేయడం చాలా అరుదు. ఆ విషయంలో విశ్వక్ చేస్తున్న ప్రయోగం ఏమేరకు ఫలితాన్ని అందిస్తుందో తెలియాంటే ఇంకొంతకాలం ఎదురుచూడాలి. విశ్వక్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ‘మెకానిక్ రాకీ’ సినిమా సెట్స్‌పై ఉంది.
విశ్వక్ ‘లైలా’వతారం!
Comments are closed.
Vesham kudirindhi. Ante. Story bagunte hit.
Call boy jobs available 9989064255