ఒపీనియన్: వివిధ పార్టీ ల సోషల్ మీడియా కార్యకర్తల ప్రవర్తన!

పార్టీ కి నిస్వార్థంగా, లేదా పదవుల కోసం అవకాశాల కోసం .,, గట్టిగా పని చేసిన అందరికీ ఒకేసారి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయినా, చంద్రబాబు గారి దగ్గర అయినా, జగన్ గారి దగ్గర అయినా మంత్రదండం ఉండదు.

రాజకీయ పార్టీలు ఒక్కో రొటేషన్ లో కొందరికి అవకాశం ఇస్తూ ముందుకు వెళ్తుంటారు, టికెట్ రాని వాళ్ళకి సమీప భవిష్యత్ లో కాబినెట్ హోదా రాష్ట్ర పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు లాంటి పదవులు వస్తాయి

సోషల్ మీడియాలో రాజకీయ అవగాహన లేని, పరిపక్వత లేని కొందరు వ్యక్తులు చేసే పోస్టులు అర్థ రహితంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రం మొత్తం కలిపి ఒక మూడు నాలుగు పేర్లు రాసి వీళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి తమ అధినేత “పార్టీని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేదు ” అని అసమ్మతి వ్యక్తం చేయడం, ఆరోపణ చేయడం ఫూలిష్ నెస్.

ఈ అపరిపక్వ పద్ధతి జనసైనికుల్లో ఎక్కువ, టిడిపిలో కొంత వరకు కనిపిస్తూ ఉంటుంది. వైసిపి సోషల్ మీడియా వారు మాత్రం తమ అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.

అంత పెద్ద తెలుగుదేశం పార్టీ కేవలం టికెట్ వచ్చిన 145 మందితో నిర్మాణం అవ్వలేదు! కనీసం అదే స్థాయి ఉన్న ఇంకొన్ని వేల మంది సమయం, డబ్బు, సేవ పెడితే నడుస్తోంది ఆ పార్టీ. అంటే .. సీట్లు వచ్చిన 145 కాకుండా ఇంకా వందలాది మందికి అవకాశం కల్పించలేదు అన్నట్టే !

తెదేపా తో పోల్చుకుంటే జనసేన స్థాయికి అవకాశం రాని వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ.

కానీ ఎక్కడా లేని అల్లరి జనసెన లో కొందరి సొంతం ! ఆ ప్రాసెస్ లో మీరు అధినేత సక్రమంగా పనచేయడానికి లేకుండా.. అనవసరపు ఒత్తిడి, పరువు తియ్యడం చేస్తున్నారు అని గమనించండి.

జనసేన పోతిన మహేష్ లు, సందీప్ పంచకర్ల లు మంచి పని చేశారు పార్టీ కి.. అయితే వారు టిడిపి దేవినేని ఉమ, నల్లమిల్లి శేషరెడ్డి, కల్వపుడి శివ కన్నా పెద్ద నాయకులు ఏమి కాదు వాళ్ళు అనే నిజాన్ని గమనించాలి. ఉమ , శేష, శివ లాంటి వందల మంది టిడిపి వారికి కూడా అవకాశం రాలేదు. జనసేన లో అతి కొద్ది మందికి మాత్రమే అవకాశం రాలేదు. 90% జనసైనికుల కి ఈ విషయం అర్థం అయ్యి అలయెన్స్ కి పూర్తి మద్దతుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా మారాలి. IPac కి అమ్ముడుపోయిన వాళ్ళని వదిలేయండి

అలాగే వైసిపి! వందల మంది జీవితం, కష్టం పెడితే ఆ స్థాయి లో ఉంది పార్టీ… కానీ అవకాశం వచ్చింది 175 మందికి మాత్రమే. కానీ అవగాహన లేని జనసైనికులు లాగా వైసిపి సోషల్ మీడియా వాళ్ళు ఏమైనా జగన్ పైన విమర్శిస్తున్నారా !? మహిళలను బూతులు తిట్టడం, డబ్బుకి పని చేయడం లాంటి అవలక్షణాలు ఉన్నా పార్టీ లైన్ పైన ఉండడం లో సుశిక్షితులు వైసిపి ఆర్మీ

ఇక టిడిపి లో ఒక వింత వర్గం ఉంది. పొత్తు ధర్మం గురించి వీళ్ళు జనసైనికులకి నీతులు చెప్పి, బిజెపి పైన వాళ్ళకి ఇచ్చిన సీట్ల పైన మాత్రం విమర్శలు చేస్తారు. చంద్రబాబు గారికి తెలియదా ?

ఇక బిజెపి ఆంధ్ర వింగ్ .. వీరికి ఉన్న 1% ఓటు శాతంకి, సోషల్ మీడియా లో వేసే వేషాలకి సంబంధం ఉండదు. అందులో సగం మంది పూజలు మోడీ కీ, ఫలహారాలు జగన్ గారికి బ్యాచ్. ఈ వైసిపి-బిజెపి వర్గం న్యూసెన్స్ ని వదిలేసి అసలైన బిజెపి అభిమానులు పొత్తు కోసం దేశం కోసమే పని చేస్తున్నారు

ఇవి అన్నీ గమనించి ఆయా పార్టీ ల సోషల్ మీడియా వాళ్ళు రాష్ట్రం అజెండా గా పని చెయ్యాలి. పార్టీ పైన అభిమానంతో ఒక వెయ్యి రెండు వేలు మంది X followers మన చుట్టు చేరితే ప్రతి ఒక్కడు పార్టీ అధిష్టానం కన్నా నాకు ఎక్కువ తెలుసు అని బ్లాక్మైల్ చేసే ధోరణి , వ్యక్తిగత ప్రలోభాలు, అభిప్రాయాలు మానేసి రాష్ట్ర పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని ఒకటే మాట ఒకటే బాట గా పార్టీ లైన్ కి కట్టుబడి ఉండాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close