‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి తన పగని ఎలా తీర్చుకున్నాడనే సైరెన్ మెయిన్ పాయింట్. సీరియల్ మర్డర్స్ తో పాటు డాటర్ సెంటిమెంట్, కుల వివక్ష, హీరోయిజం, అంగవైకల్యం, సందేశం… ఇలా పలు కోణాల్లో సాగిన ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైయింది. మరి ఇందులో ఎమోషన్ ప్రేక్షకులు కనెక్ట్ అయ్యిందా? క్రైమ్ థ్రిల్ ని పంచిందా?

14 ఏళ్లపాటు జైలు శిక్షని అనుభవించిన తిలక్‌ (జయం రవి) పెరోల్‌పై బయటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తిలక్ ని తీవ్రంగా అసహ్యించుకుంటుంది కూతురు. కనీసం చూడటానికి కూడా ఇష్టపడదు. తిలక్‌ పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో వరుసగా కొన్ని హత్యలు ఒకే ప్యాట్రన్ లో జరుగుతాయి. ఈ కేసులను విచారణ చేసే బాధ్యత పోలీస్‌ ఆఫీసర్‌ నందిని (కీర్తి సురేశ్‌)కి అప్పగిస్తుంది డిపార్ట్‌మెంట్‌. మరి విచారణలో పోలీస్‌ ఆఫీసర్‌ నందినికి ఎలాంటి నిజాలు తెలిసాయి? అసలు తిలక్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతని గతం ఏమిటి? చేసిన నేరం ఏమిటి? తిలక్ కి కూతురు దగ్గరైయిందా? వరుస హత్యల కేసుని నందిని చేధించిందా?

నేరము- శిక్ష కథల ఫార్మూలా ఇప్పటిది కాదు. ఇలాంటి కథలతో మెప్పించాలంటే కథనంలో కొత్తదనం ఉండాల్సిందే. సైరెన్ కూడా ఓ రొటీన్ పాయింటే. అయితే ఈ పాయింట్ ని కొంత వరకూ ఎంగేజింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్‌. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో తిలక్‌ గతం- వర్తమానం, మరోవైపు కీర్తి సురేశ్‌ ట్రాక్, రాజకీయ నాయకుడు హత్య.. ఇవన్నీ ఇంటర్ కట్స్ గా చూపిస్తూ కథపై ఆసక్తిని పెంచాడు. తిలక్ కుటుంబం, తన కూతురి ఎమోషన్ మొదట్లో హత్తుకునేలా వుంటాయి. ఈవ్ టీజింగ్ ఎపిసోడ్ ని కూడా కథలో ఆసక్తిగానే మిక్స్‌ చేశారు. అసలు తిలక్ గతం ఏమిటి? తనకు జరిగిన అన్యాయం ఏమిటి? ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి? అనే ఆసక్తి సహజంగానే కలుగుతుంది.

ఇలాంటి కథలకు ఆయువు పట్టు ఫ్లాష్ బ్యాక్. హీరోకి జరిగిన అన్యాయం తీవ్రత‌ని ప్రేక్షకుడు కూడా ఫీలవ్వాలి. సైరన్ లో మాత్రం అది రొటీన్ అయిపొయింది. పైగా ఆ పాయింట్ కుల వివక్షతో ముడిపెట్టడం మరింత రొటీన్ వ్యవహారంగా మారింది. గతం రొటీన్ గా వున్నప్పుడు దాన్ని వీలైనంత పదునుగా చూపాల్సింది. కానీ సైరన్ దాన్ని సాగదీశారు. దీంతో పాటు కావాల్సినదాని కంటే ఎక్కువ డ్రామా, ఎమోషన్, సందేశం ను యాడ్ చేసే ప్రయత్నం కాస్త.. మితిమీరిన మెలోడ్రామాకి దారితీసింది.

క్రైమ్ థ్రిల్లర్స్ లో విచారణ ప్రేక్షకుడి థ్రిల్ పంచాలి. ఇందులో మాత్రం విచారణ నిదానంగా సాగుతుంది. పోలీస్ అధికారి నందిని పాత్రకు చాలా బిల్డప్ ఇచ్చి ఆ పాత్రని తేలిగ్గా చూపించారు. మొదట్లో అసలు కేసులోకి వచ్చిరానట్లుగానే వుంటుంది. దీంతో పాటు హీరోకి తన దారిలో పెద్దగా ఆటంకాలు ఎదురుకావు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతాడు. తొలిసగంలో ఆ పాత్రని సగటు సామాన్యుడిగా చూపించి.. తర్వాత మాస్ కమర్షియల్ హీరోగా మార్చేసిన‌ తీరు కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని సన్నివేశాలు లాజిక్ దూరంగా అనిపిస్తాయి. ప్రణాపాయంలో వున్న వ్యక్తిని డాక్టర్ కి బదులు నర్స్ రక్షించేయడం టూమచ్ లిబ‌ర్టీ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో వాకీ టాకీ ఎపిసోడ్ అయితే మరీ పేలవంగా వుంటుంది. ఒకటి రెండు మలుపులు మాత్రం ఆసక్తికరంగానే వుంటాయి.

తిలక్‌ పాత్రలో జయం రవి ఒదిగిపోయాడు. జైల్లో నుంచి వచ్చిన తర్వాత తన ఆహార్యం సరిగ్గా సరిపోయింది. కూతురు పట్ల తనకు వున్న ఎమోషన్ బాగానే పండింది. కీర్తి సురేశ్‌ కి పోలీస్ గెటప్ బావుంది కానీ తన పాత్రే బలంగా లేదు. అసంపూర్ణంగా ముగించిన భావన కలుగుతుంది. ఆ పాత్రలో క్లైమాక్స్ కి ముందు వున్న వేగం ఆద్యంతం వుంటే బావుండేది. అనుపమ పరమేశ్వరన్ ది గెస్ట్ రోల్ అనుకోవాలి. యోగి బాబు కామెడీ కొన్ని చోట్ల వర్క్ అవుట్ అయ్యింది. సముద్రఖని, అజయ్ రొటీన్ పాత్రల్లోనే కనిపించారు.

జీవి ప్రకాష్ కుమార్ పాటలు తేలిపోయాయి. నిజానికి ఈ కథకు పాటలు అనవసరం. సామ్ సియస్ నేపధ్య సంగీతం మాత్రం థ్రిల్ ని పంచింది. కెమరాపనితనం బావుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. రాత తీతలో ఎక్కడా అసభ్యత లేకపోవడం మెచ్చుకోదగ్గ అంశం. సినిమా ఓటీటీలో వుంది కాబట్టి వీలుంటే ఓసారి ప్రయత్నించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close