క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో ‘కుబేర‌’ ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగ్ పాత్ర ఏమిట‌న్న విష‌యం చిత్ర‌బృందం సస్పెన్స్ లో పెట్టింది. ఈరోజు హైద‌రాబాద్ – రాజ‌స్థాన్ మ‌ధ్య ఐపీఎల్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గే ఈమ్యాచ్ కామెంట‌రీ బాక్స్ లో నాగార్జున ప్ర‌త్య‌క్షం కానున్నారు. ‘కుబేర‌’లో నాగ్ లుక్ అక్క‌డే విడుద‌ల చేయ‌బోతున్నారు. నాగ్ లుక్ తో పాటుగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన ఓ స‌ర్‌ప్రైజ్‌ని ఇక్క‌డ రివీల్ చేయ‌బోతున్నారు.

‘కుబేర‌’లో నాగ్ ఈడీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్నే ఈరోజు రివీల్ చేసే అవ‌కాశం ఉంది. ఓ అనామ‌కుడు ఎలా అప‌ర కోటీశ్వ‌రుడిగా మారాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. మాఫియా నేప‌థ్యంలో ఈ క‌థ న‌డ‌వ‌బోతోంది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌న్నీ క్లాసీగా ఉంటాయి. అయితే తొలిసారి మాస్‌, యాక్ష‌న్ క‌థ‌ని ఎంచుకోవ‌డం ఆయ‌న అభిమానుల్ని ఆశ్చ‌ర్యంలో పడేస్తోంది. ర‌ష్మిక క‌థానాయిక‌. రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close