ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ – సంయుక్త క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. రూ.50 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బెల్లంకొండ‌కు బాగా ఇష్ట‌మైన క‌థ ఇది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బెల్లంకొండ‌పై రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్ట‌డం పెద్ద రిస్క్‌. కానీ క‌థ‌పై న‌మ్మ‌కంతో నిర్మాత‌లు ఈ రిస్క్ చేయ‌డానికి ముందుకొచ్చారు. యేడాది పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిగాయి. జూన్‌లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.

సైన్స్ ఫిక్ష‌న్, సోషియోఫాంట‌సీ క‌ల‌గ‌లిపిన థ్రిల్ల‌ర్ ఇది. ఈ జోన‌ర్‌కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆద‌ర‌ణ ఉంది. అందుకే ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. న‌టీన‌టులు, ఇత‌ర టెక్నీష‌య‌న్ల ఎంపిక జ‌రుగుతోంది. టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్ లో తెర‌కెక్కించ‌డానికి మూన్ షైన్ పిక్చ‌ర్స్ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని కొన్ని కాంబినేష‌న్లు కూడా ఈ సినిమాతో తెర‌పై క‌నిపించే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే టైటిల్ తో పాటుగా, సినిమా వివ‌రాల్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close