మీడియా వాచ్ : బీబీసీని వెళ్లగొట్టినట్లే !

బీబీసీ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో తన లైసెన్స్‌ను తన మాజీ ఉద్యోగులు పెట్టిన కంపెనీకి అప్పగించింది. భారత్‌లోని తన న్యూస్‌రూమ్‌ను మూసేసింది. నలుగురు బిబిసి మాజీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ‘కలెక్టివ్‌ న్యూస్‌రూమ్‌’ పేరిట ఏర్పడిన ప్రయివేటు లిమిటెడ్‌ కంపెనీకి బిబిసి ప్రచురణ లైసెన్సును అప్పగించింది.

1940లో భారత్ లో బీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఐదేళ్ల కిందట ప్రాంతీయ భాషల్లోనూ ప్రారంభించింది. కరోనా తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది బీబీసీ. అయితే 2021లో కేంద్రం దేశీయ డిజిటల్‌ మార్కెట్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతమేనని తేల్చింది. ఆ పరిమితి దాటిన కంపెనీలు తమ విదేశీ పెట్టుబడులను నియంత్రణలకు అనుగుణంగా తగ్గించుకోవాల్సి వచ్చింది.

బిబిసి ఇండియాలో 99.9 శాతం ఎఫ్‌డిఐ కావడంతో ఆ కొత్త నిబంధన గుది బండగా మారింది. విధి లేని పరిస్థితులలో కార్యకలాపాలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కలెక్టివ్ న్యూస్ రూమ్ కు బీబీసీ పూర్తి మద్దతు ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేసింది బీబీసీ మాజీ ఉద్యోగులే. బీబీసీని టార్గెట్ చేసి గతంలో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించిన తర్వాత నుంచే.. అసలు ఆ సంస్థను సాగనంపే కార్యక్రమాలు జరిగాయి. బీబీసీకి ఇండియాలో చోటు లేకపోవడం.. ఓ రకంగా భారత్ ఇమేజ్ ను.. ప్రపంచ మీడియా రంగంలో కాస్త పలుచన చేసేదేనని నిపుణుల అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close