ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా , పత్రాలు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. చివరికి ఆస్తి యజమానుల ఫింగర్ ప్రింట్స్ కూడా వారి దగ్గరే ఉంటాయి. వాటిని ఉపయోగించుకుని రాత్రికి రాత్రి పత్రాలు మార్చేస్తే ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా.. మొదట ప్రభుత్వ అధికారి దగ్గరకే వెళ్లాలి. మొత్తం ఓ కుట్ర ప్రకారం… ప్రజల ఆస్తులపై హక్కులు లేకుండా చేస్తున్నారన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి.

రిజిస్ట్రేషన్ల శాఖలో కార్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్తి సొంతదారుడు, కొనుగోలుదారుడు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండవు. వీరి వేలిముద్రనే సంతకంగా పరిగణిస్తున్నారు.
కొత్త విధానంలో దరఖాస్తుదారులే స్వయంగా డాక్యుమెంట్లు రూపొందించుకోవాలి. లేదా నెట్‌సెంటర్‌ నిర్వాహకులను ఆశ్రయించాలి. డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్‌ కావాలి. అందులో ఏ రకమైన డీడ్‌ రాయించుకోవాల్సి ఉంటుందో దానికి సంబంధించిన ఫార్మేట్‌ను ఎంపిక చేసుకుని, ఆ వివరాలు నమోదు చేసి, దానిని సబ్‌రిజిస్ట్రార్‌కు లింక్‌ రూపంలో పంపించాలి. దానిని సబ్‌ రిజిస్ట్రార్‌ పరిశీలించిన తర్వాత అందులో ఏవైనా తప్పులను సవరించాల్సి ఉంటే తిరిగి దరఖాస్తుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ మెయిల్‌ ద్వారా లింక్‌ పంపుతారు. వాటిని కూడా సరిచేసి లింక్‌ ద్వారానే మరలా సబ్‌రిజిస్ట్రార్‌కు పంపితే, దానిని ఆయన ఓకే చేసినతర్వాతే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్ళి వేలిముద్ర వేయాల్సివుంటుంది.

ఇంత చేసిన తర్వాత కూడా అసలైన పత్రాలివ్వరు. అవి ప్రభుత్వం దగ్గరే అంటే.. ఈ ర్డు ప్రైమ్‌ 2.0 అనే రిజిస్ట్రేషన్ విధానం గుప్పిట్లో పెట్టుకున్న క్రిటికల్ కేర్ అనే ప్రైవేటు కంపెనీ వద్ద ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్ సంగతి సరే.. అసలైన పత్రాలు ఎందుకు ఇవ్వరు.. జిరాక్సులే ఎందుకు ఇస్తారన్నది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా… అమలు చేయాల్సిందేనని అధికారులు ఆదేశాలిచ్చారు. దీని వెనుక గూడుపుఠాణి ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

వంగా గీతకు మంత్రిపదవా ? ఆళ్ల, మర్రి, గ్రంధి నవ్వుకుంటారు జగన్ గారూ !

కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close