ద‌ర్శ‌కురాలిగా ఆర్.జే!

ఆర్జే.. (రేడియో జాకీ)ల‌కూ టాలీవుడ్ కు గట్టి అనుబంధ‌మే ఉంది. కొంత‌మంది ఆర్‌.జేలు న‌టుల‌య్యారు. ఇంకొంత‌మంది డ‌బ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు. కొంద‌రు హీరోలుగానూ మారారు. ఇప్పుడు ఓ ఆర్‌.జే మెగాఫోన్ ప‌ట్ట‌బోతోంది. త‌నే.. ఆర్జే శ్వేత‌. రేడియో జాకీగా శ్వేత అంద‌రికీ సుప‌రిచిత‌మే. డార్లింగ్ శ్వేత‌గా త‌న‌కు మంచి గుర్తింపు ఉంది. స్వ‌త‌హాగా డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. చాలామంది క‌థానాయిక‌ల‌కు గొంతు అరువిచ్చింది. ‘ఉప్పెన‌’లో బేబ‌మ్మ‌గా న‌టించిన కృతిశెట్టికి త‌నే వాయిస్ ఇచ్చింది. ఇప్పుడు ద‌ర్శ‌కురాలిగా మారుతోంది.

బిగ్ బెన్ ప్రొడ‌క్ష‌న్‌లో ఓ కొత్త సినిమా త్వ‌ర‌లోనే శ్రీ‌కారం చుట్టుకోబోతోంది. దీనికి శ్వేత ద‌ర్శ‌కురాలు. బిగ్ బెన్ సంస్థ‌కు కొత్త ద‌ర్శ‌కుల్ని ప‌రిచ‌యం చేయ‌డం అల‌వాటు. త‌రుణ్ భాస్క‌ర్‌, భ‌ర‌త్ క‌మ్మ‌, కె.వి.ఆర్. మ‌హేంద్ర‌, సంజీవ్ రెడ్డి, ప్ర‌ణీత్‌, చెందు ముద్దు ఇలా కొత్త టాలెంట్ ప్రోత్స‌హిస్తోంది. ఇప్పుడు శ్వేత‌ని కెప్టెన్ కుర్చీలో కూర్చోబెట్టింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లో చిత్ర‌బృంద‌మే స్వ‌యంగా వెల్ల‌డించ‌నుంది,.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టు చెప్పినా తప్పే : సజ్జల

వైసీపీ నేతలు తాము ఏది చెస్తే అది.. ఏం చెబితే అది మాత్రమే ఫైనల్ అనుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును సైతం ... వాళ్లు చెబితే కరెక్టా అని...

క‌థాక‌మామిషు – ఈ వారం క‌థ‌ల‌పై స‌మీక్ష‌

సాహితీ ప్ర‌పంచంలో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. ప్ర‌తీరోజూ ఎన్నో క‌థ‌లు పుడుతుంటాయి. అందులో కొన్ని ప్ర‌చుర‌ణ వ‌ర‌కూ వెళ్తాయి. అలాంటి క‌థ‌ల్ని పాఠ‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న‌దే 'క‌థాక‌మామిషు' ప్ర‌ధాన ఉద్దేశం. ఈ...

మ‌ళ్లీ హ్యాపీడేస్ మొద‌ల‌య్యాయా?

శేఖ‌ర్ కమ్ముల 'హ్యాపీడేస్‌' చాలామంది జీవితాల్ని మార్చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్థిర‌ప‌డిపోయిన‌వాళ్లు ఎంతోమంది. అందులో టైస‌న్ గా మెప్పించిన రాహుల్ కూడా 'హ్యాపీడేస్' త‌ర‌వాత హీరోగా మారాడు. కొన్ని సినిమాలు...

లిక్క‌ర్ స్కాంపై ఈడీకి ఎమ్మెల్సీ క‌విత చెప్పిన స‌మాధానాలు ఇవే

ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో నా పాత్ర లేదంటూ ఎమ్మెల్సీ క‌విత ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. అరుణ్ పిళ్లై త‌న ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని... వీకెండ్స్ లో క‌లిసేవారిమ‌ని, అయితే నా త‌ర‌ఫున పెట్టుబ‌డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close