అవధూతగా ప్రభాస్ ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఇటివలే అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టారని అభిమానులుని సర్ ప్రైజ్ చేశారు విష్ణు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలో కేవలం ప్రభాస్ కాళ్ళని మాత్రమే చూపించారు.

కాగ ఈ చిత్రం ప్రభాస్ పాత్రపై భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఇందులో ప్రభాస్ శివునిగా కనిపిస్తారని మొదట ప్రచారం జరిగింది. శివ భక్తుడైన నందీశ్వరుడుగా ప్రభాస్‌ కనిపించనున్నారని మరికొన్ని వార్తలు వినిపించాయి.

ఇప్పుడు ఆయన పాత్రకు సంబధించిన మరో ఆసక్తికరమైన సంగతి తెలిసింది. ఇందులో ప్రభాస్ అవధూతగా కనిపిస్తారని సమాచారం. అవధూత అంటే.. కేవలం బ్రహ్మ నిష్ఠతో వర్ణాశ్రమాదులను విడచిన సన్యాసి, శరీరం విూది ఆచ్ఛాదనంతో సహా లౌకిక బంధాలన్నీ వర్జించినవాడు; దిగంబర సన్యాసి, దండకమండలాదులను కూడా విడిచిన తాపసి అనే అర్ధాలు వున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. మరో రెండు రోజుల్లో ఆయన పోర్షన్ అంతా పూర్తవుతుంది. తర్వాత ఆయన పాత్రకు సంబధించిన మరో అప్డేట్ వచ్చే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close