టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం రమేష్ వచ్చే వరకే. ఆయనను డిస్కషన్‌కు పిల్చే సరికి అంతా మారిపోయింది. మురళీకృష్ణ సీఎం రమేష్ ను పిలిచి పోలింగ్ సరళిపై ఏదో నిరూపిద్దామనుకున్నారు. కానీ రివర్స్ అయింది. చివరికి ఆయనతో డిస్కషన్ ను మధ్యలో ముగించేసి.. ఆ వీడియోను కూడా ప్రైవేటు చేసుకోవాల్సి వచ్చింది.
అంబటి రాంబాబు, సీఎం రమేష్ మధ్య డిస్కషన్ చూసిన వారికి టీవీ 9 ఎంత దుర్భరమైన మురికి గుంటలో ఉందో అర్థమైపోతుంది. తాము అనుకున్నదే నిజమని ప్రయత్నంలో ఓ నలుగురితో ముఠాగా ఏర్పడి.. ఒకే అభిప్రాయాల్ని పదే పదే చెప్పడం కామన్ గా మారిపోయింది. సీఎం రమేష్ ఆ ప్రయత్నాల్ని చీల్చి చెండాడారు. అనేక కీలక విషయాల్ని వెల్లడించారు. ఈ వీడియోలు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆన్ లైన్ లో పెట్టారు. కానీ అసలు వీడియో లింక్ ను మాత్రం టీవీ 9 డిలీట్ చేసింది.
టీవీ 9కి ఎంత వారినైనా కించపర్చడం పెద్ద విషయం కాదు. న్యూస్ ను బయాస్ చేయడం వెన్నతో పెట్టిన విద్య. జగన్ కోసం.. వైసీపీ కోసం ఎందాకైనా సిద్ధమన్నట్లుగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది. కానీ కార్నర్ చేద్దామని సీఎం రమేష్ ను ఆహ్వానించారో.. మరొకటో కానీ.. ఆయన సమాధానాలకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ డిస్కషన్ జనం చూస్తే పరువు పోతుందని.. ఎప్పుడూ లైని విధంగా వీడియో డిలీట్ చేసుకున్నారు. పాపం టీవీ9కి ఇది ఘోరమైన ఓటమి.