‘ఎఫ్ 3’లో ఆ మూడో హీరో ఎవ‌రు?

‘ఎప్ 2’తో బాక్సాఫీసుని షేక్ చేసేశాడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతి విజేత‌గా నిలిచిన సినిమా ఇది. ‘ఎప్ 3’ తీస్తామ‌ని.. ఎఫ్ 2 చివ‌ర్లో హింట్ ఇచ్చారు. అందుకు వీలైన క‌థే ఇది. ఎఫ్ 2 సూప‌ర్ హిట్ట‌య్యింది కాబ‌ట్టి… ఎఫ్ 3 త‌ప్ప‌కుండా ఉంటుంది. ఈ సినిమాలో మ‌రో క‌థానాయ‌కుడికీ ఛాన్స్ ఉంది. ఈ ఇద్ద‌రు తోడ‌ళ్లుళ్ల‌కు మూడో వాడు  తోడ‌వుతాడ‌న్న‌మాట‌. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిగా మారింది.  ఎఫ్ 3 ఇప్ప‌టికిప్పుడు తీయ‌క‌పోయినా… మ‌రో యేడాది త‌ర‌వాతైనా ఈ సినిమా ఉండొచ్చు. మూడో హీరో విష‌యంలో ఇప్ప‌టికే అనిల్ రావిపూడి ఓ క్లారిటీతో ఉన్న‌ట్టు స‌మాచారం. ఆ ఛాన్స్ ర‌వితేజ లేదంటే నాని… ఇద్ద‌రిలో ఒక‌రికి ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ర‌వితేజ‌తో `రాజా ది గ్రేట్‌` రూపొందించాడు అనిల్‌. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కామెడీ పండించ‌డంలో ర‌వితేజ స్టైల్ తెలియంది కాదు. `ఎఫ్ 3`లో ర‌వితేజ ఉండే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌న్న‌ది ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌. మ‌రోవైపు నానివైపు కూడా అనిల్ మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. నాని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎఫ్ 2 క‌థ అనుకుంటున్న‌ప్పుడు అనిల్ రావి పూడి మ‌దిలో మెదిలిన హీరోల్లో నాని ఒక‌డు. సో… ర‌వితేజ‌గానీ, నాని గానీ ఈ సీక్వెల్ లో పాలు పంచుకునే అకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రికి టిక్ పెడ‌తాడ‌న్న‌ది అనిల్ చేతుల్లోనే ఉంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com