భారీ చిత్రాలకు దిల్ రాజు దూరం?

నిర్మాత దిల్ రాజు చేతిలో ప్రస్తుతం వున్న సినిమా మహర్షి. లైన్ లో మాత్రం చాలా ప్రాజెక్టులు వున్నాయి. అయితే ఇకపై కొన్నాళ్ల పాటు భారీ సినిమాల నిర్మాణాలకు దూరంగా వుండాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట.
ఇవ్వాళో, రేపో, 96 సినిమా రీమేక్ అధికారిక ప్రకటన వస్తుంది. శర్వానంద్-సమంత కాంబినేషన్. దీంతో పాటే ఇంద్రగంటి-నాని కాంబినేషన్ సినిమా ఎలాగైనా స్టార్ట్ చేయాలని దిల్ రాజు సీరియస్ గా వున్నారు. కానీ కథే సెట్ కావడం లేదు. అనిల్ రావిపూడితో మరో ప్రాజెక్ట్ టైమ్ పడుతుంది. 
ఈలోగా మీడియం హీరోలు ఎవరు దొరికితే వాళ్లతో మంచి ప్రాజెక్టులు ప్లాన్ చేయాలని చూస్తున్నారు. దిల్ రాజు జాబితాలో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి నాగ్ చైతన్య వరకు చాలా ఆలోచనలు వున్నాయి. ఏది చేసినా ముఫై కోట్ల కు కాస్త అటు ఇటుగా తప్ప, భారీ సినిమాలు ఇప్పట్లో చేయరని తెలుస్తోంది. ఆ మధ్య బన్నీతో ఒక సినిమా చేయాలని ఆలోచించారు కానీ, ఫ్రస్తుతానికి ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టారని టాక్. ఇకపై సంక్రాంతిని మాత్రం వదల కూడదని, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి ఏటా ఒకటి ప్లానింగ్ లో వుంచుకొవాలని కూడా నిర్ణయించేసుకున్నారట.
మీడియం సినిమాల్లో శ్రీనివాస కళ్యాణం బ్యాక్ ఫైర్ అయింది తప్ప, మిగిలినవి ఏవీ దిల్ రాజును అంతగా నిరాశపర్చలేదు. అందుకే దిల్ రాజు ఇలా డిసైడ్ అయినట్లున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close