‘మేం ఫేమస్’ సినిమాతో ఆకట్టుకొన్న యువ హీరో సుమంత్ ప్రభాస్. ఆ సినిమా తరవాత చాలా ఆఫర్లు వచ్చినా వాటన్నింటినీ పక్కన పెట్టి ‘గోదారి గట్టుపైన’ కథ ఎంచుకొన్నాడు. జగపతిబాబు, లైలా ప్రధాన పాత్రలు పోషించారు. నిధి ప్రదీప్ కథానాయిక. సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. మే8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
గోదారి జిల్లా నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఓ ఆటోవాలకు ఓ అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తరవాత ప్రేమగా మారుతుంది. ఆ అమ్మాయికి అబ్బాయంటే ఇష్టం. కానీ నాన్నంటే మరీ ఇష్టం. నాన్నని కాదని ఒక్క పని కూడా చేయదు. మరి తండ్రి బాటలో నడిచే అమ్మాయి తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొంది? ఈ ప్రేమ కథ ఏ కంచికి చేరుకొంది అనేది మిగిలిన కథ. ట్రైలర్ లోనే కథేంటో టూకీ గా చెప్పే ప్రయత్నం చేశారు. సుమంత్ ప్రభాస్ లుక్ బాగుంది. పక్కింటి కుర్రాడి పాత్రలకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా కనిపిస్తున్నాడు. నిధి కూడా తెలుగమ్మాయే. చూడ్డానికి చక్కగా ఉంది. ఇద్దరి జోడీ బాగుంది. జగపతిబాబు కి ఈసారి స్ట్రాంగ్ క్యారెక్టర్ పడినట్టు అర్థం అవుతోంది. ప్రేమలో ఎమోషన్స్ మోతాదు ఎక్కువగా కనిపిస్తోంది. కామెడీతో పాటు అవి కూడా వర్కవుట్ అయితే.. దర్శక నిర్మాతలు కోరుకొనే ఫలితం దక్కే అవకాశం ఉంది.
కథలో ఇంకో బలమైన ఎలిమెంట్ ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదేమిటో సినిమా చూశాకే అర్థం అవుతుంది.
