కవిత పార్టీని గుర్తించకూడదని బీఆర్ఎస్ అగ్రనేతలు డిసైడయ్యారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యవర్గ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. కాంగ్రె్స ప్రభుత్వంపై చాలా మాటలు మాట్లాడారు. తేజస్వీసూర్యను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. బీజేపీని అనలేదు. అదే సమయంలో కవిత పార్టీపై స్పందించలేదు. విశ్లేషాలను వివరించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాత్రం తేలికగా స్పందించారు. పాతికేళ్లు ఉన్నపార్టీలు తక్కువని.. కొన్నిపార్టీలు వస్తూంటాయి.పోతూంటాయి. పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. అంటే.. కవిత పార్టీని లెక్కలోకి తీసుోకకుండా రాజకీయం చేయాలని చూస్తున్నారు.
కవిత పార్టీని ఒక రాజకీయ శక్తిగా గుర్తించకపోవడం ద్వారా, దానికి ప్రజల్లో ప్రాధాన్యత లభించకుండా చేయాలన్నది బిఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. కవిత పార్టీని కేవలం ఒక తాత్కాలికం చిత్రీకరించడం ద్వారా బిఆర్ఎస్ శ్రేణుల్లో ఎటువంటి అయోమయం కలగకుండా జాగ్రత్తపడే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా ఉన్న టిఆర్ఎస్ అనే పాత పేరునే కవిత తన పార్టీకి పెట్టుకోవడం బిఆర్ఎస్కు కొంత ఇబ్బందికరమైన విషయమే.
గతంలో బిఆర్ఎస్ నుండి బయటకు వెళ్ళిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, కవితకు క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్, ఆమె చేస్తున్న సామాజిక న్యాయం నినాదం బీఆర్ఎస్కు ఇబ్బందికరంగానే ఉంది. ఒకవైపు కాంగ్రెస్తో పోరాడుతూనే, మరోవైపు సొంత కుటుంబం నుంచి వచ్చిన ఈ సవాలును నిశ్శబ్ద వ్యూహంతో ఎదుర్కోవాలని బిఆర్ఎస్ భావిస్తోంది.
