‘వారసుడు’ తరవాత ఎట్టకేలకు వంశీ పైడిపల్లి సినిమా ఒకటి పట్టాలెక్కింది. సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమాని మొదలెట్టారు. నయనతార కథానాయిక. వంశీ స్టైల్ లోనే స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. కాస్టింగ్ విషయంలోనూ వంశీ ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొన్నారు. సౌత్ టచ్ వచ్చేలా నటీనటుల్ని ఎంచుకొంటున్నారు. నయనతారని కథానాయికగా ఫిక్స్ చేయడం వెనుక ఉద్దేశం అదే. సౌత్ కి చెందిన అరవింద్ స్వామికి ఓ కీలక పాత్ర అప్పగించారు. ఇప్పుడు.. విలన్ పాత్ర కోసం కూడా దక్షిణాది వైపే చూస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ పేరు పరిశీలనలో ఉంది. ఆయనతో చిత్రబృందం సంప్రదింపులు మొదలెట్టింది. సల్మాన్ తో.. ఫహద్ కాంబో కిక్ ఇస్తుందని అందరి నమ్మకం. కాకపోతే.. ఫహద్ కాల్షీట్లు ఏమాత్రం ఖాళీగా లేవు. ఆయన అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి సినిమా కోసం ఆయన్ని సంప్రదిస్తే డేట్లు ఖాళీ లేక.. `నో` చెప్పారు. సల్మాన్ ఖాన్ సినిమా అంటే పాన్ ఇండియా గుర్తింపు ఉంటుంది కాబట్టి, డేట్లు ఎడ్జిస్ట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే.. ఈ సినిమా ఒప్పుకొంటే, కొన్ని సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. వంశీ బల్క్ డేట్లు అడుగుతున్నారు. అవన్నీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
మరోవైపు ఆప్షన్ బి కూడా అట్టిపెట్టుకొన్నారు. ఫహద్ ఒప్పుకోకపోతే అక్షయ్ ఖన్నాతో ప్రొసీడ్ అవ్వాలన్నది ప్లాన్. ఈమధ్య అక్షయ్ ఖన్నా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. విలన్ గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు నచ్చుతోంది. కాబట్టి.. అక్షయ్ వాళ్ల ముందున్న మరో ఆప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. సల్మాన్ ఖాన్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2027లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
