రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలకు మరో ఆరు రోజులే మిగిలింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ సినిమా హవా మొదలైంది. ఓవర్సీస్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికా మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే, రామ్ చరణ్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ అందుకునే సినిమాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమాకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చింది. జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి లభించగా, టికెట్ ధరను జీఎస్టితో కలిపి రూ.600గా నిర్ణయించారు. అలాగే విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోల అనుమతులు లభిస్తే ‘పెద్ది’ ఓపెనింగ్స్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే ‘పెద్ది’ తొలి రోజు, తొలి వీకెండ్ వసూళ్లలో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. ప్రస్తుతం అందరి చూపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపైనే ఉంది. అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే.. ‘పెద్ది’ ఓపెనింగ్స్ అంతకుమించి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


