జూన్ 10.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అభిమానులు బాలయ్య సినిమాల నుంచి స్పెషల్ అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి వేడుకలు మరింత ప్రత్యేకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు భారీ ప్రాజెక్టుల నుంచి అప్డేట్లు రాబోతున్నాయి.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న #NBK111 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా #NBK111 నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
అదే సమయంలో బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న #NBK112 ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. సామాజిక అంశాలను కమర్షియల్ కథనాలతో మిళితం చేయడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలయ్య ఇమేజ్‌కు తగ్గ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేయనున్నారు.
గోపీచంద్ మలినేని, కొరటాల శివ ఇదరూ మాస్ పల్స్ తెలిసిన దర్శకులు. దీంతో సహజంగానే ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
