ఎందుకో ‘రావు బహద్దూర్’ పై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్ – వెంకటేష్ మహా కాంబినేషన్ లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. ‘నాట్ జస్ట్ ఏ టీజర్’ అంటూ అప్పట్లో ఓ గ్లింప్స్ వదిలారు. అది నిజంగా ట్రైలర్‌ని మించి పోయింది. ఇప్పుడు ‘జస్ట్ ఏ టీజర్’ అంటూ మరోటి వదిలారు. ఇది ఏకంగా సినిమాని మించి ఉంది. మూడున్నర నిమిషాల పాటు సాగిన టీజర్లో `రావు బహద్దూర్` ప్రపంచాన్నే పరియయం చేసేశాడు వెంకటేష్ మహా.
ఆ ప్రపంచం, పాత్రలు, మరీ ముఖ్యంగా రావు బహద్దూర్ గా సత్యదేవ్ క్యారెక్టర్, గెటప్ అన్నీ చిత్రవిచిత్రంగా ఉన్నాయి. ఆర్ట్, కెమెరా పనితనం, ఆ కలర్ గ్రేడింగ్, కాస్ట్యూమ్స్ ఒకొక్కటీ ఒక్కో కథ చెబుతున్నట్టు అనిపిస్తోంది. కథేమిటో పూర్తిగా రివీల్ చేయకపోయినా.. కచ్చితంగా ఇప్పటి వరకూ చూడని ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చిత్రబృందం కష్టపడినట్టు అర్థం అవుతోంది. సత్యదేవ్ కెరీర్ బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చాడని, తనకు అవార్డులు రివార్డులు ఖాయం అని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే వస్తోంది. ఆ మాట ఎందుకు అన్నారో ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. జలై 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. ఆయన పేరుతో ఈ సినిమాకు మరింత ప్రమోషన్ దొరకబోతోంది. మహేష్ కూడా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. అదే జరిగితే.. అది ఈ సినిమాకు బిగ్ బోనస్ అవుతుంది. ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు ఏకంగా మూడేళ్లు కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితం ప్రేక్షకులు ఇస్తారన్నది వాళ్ల నమ్మకం. మరి.. రిజల్ట్ ఏమిటన్నది తెలియాలంటే రిలీజ్ డేట్ వరకూ ఆగాలి.
