పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు పెరగడం సహజంగా కనిపించే పరిణామం. ‘పెద్ది’ రిలీజ్ సమయంలోనూ రేట్లు పెరిగాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రేట్లు పెంచుకొనేందుకు వెసులు బాటు ఇచ్చాయి. ఆ మేరకు టికెట్ రేట్లు పెరిగాయి కూడా. అయితే ఏపీలో గడువు ముగిసింది. ఈరోజు నుంచీ మామూలు రేట్లకే ‘పెద్ది’ అందుబాటులో ఉంటుంది. టికెట్ రేట్లు పెరిగాయని థియేటర్లకు దూరంగా ఉన్న జనం.. ఈరోజు నుంచి మళ్లీ థియేటర్ల వైపు చూస్తారా, లేదా? టికెట్ రేట్లు తగ్గించడం వల్ల మళ్లీ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయా? అనే కోణంలో చర్చ మొదలైంది.
ఇప్పటికే.. ‘పెద్ది’ ని చూడాల్సిన వాళ్లు చూసేశారు. రెండోవారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా మామూలు రేట్లు అందుబాటులో ఉండడం వల్ల ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని అనుకోవడం అత్యాసే. కాకపోతే.. ఈ వారం చెప్పుకోదగిన సినిమాలేం లేవు. ఈ వీకెండ్ కూడా ‘పెద్ది’ నే ఆప్షన్. అలా చూస్తే.. టికెట్ రేట్లు తగ్గించిన ప్రభావం కొంత కనిపించే అవకాశం ఉంది. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల.. ఫుట్ ఫాల్స్ ఏమైనా కనిపిస్తే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ‘పెద్ది’ ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈవారం కూడా రన్ కొనసాగితే… అన్ని ఏరియాలూ బయటపడిపోయే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటికీ పెరిగిన రేట్లే కనిపిస్తున్నాయి. మరి తెలంగాణలో ఈ రేట్లు ఎప్పుడు తగ్గిస్తారో చూడాలి.
పెద్ద సినిమా వచ్చేటప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫుట్ ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయన్న ఓ అభిప్రాయం ఉంది. క్రేజ్ ని బట్టి.. రేట్లు పెంచడం ఓకే. కాకపోతే.. పెరిగిన రేట్లు తొలి వారాంతం వరకే పరిమితం చేస్తే బాగుంటుంది. సోమవారం నుంచి మామూలు రేట్లకే సినిమా అందిస్తే – అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లవైపు రావడానికి మొగ్గు చూపించే అవకాశం ఉంది. రిలీజ్ అయిన 10 రోజులకు టికెట్ రేట్లు తగ్గిస్తే ప్రయోజనం పెద్దగా కనిపించకపోవొచ్చు.
