నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర కోసం అన్వేషణ జరుగుతోంది. ఆ ఛాన్స్ సీనియర్ నటుడు రాజశేఖర్ దక్కించుకొన్నట్టు టాక్. ఇటీవల కొరటాల ఆయనకు కథ చెప్పారని, అది రాజశేఖర్‌కి నచ్చిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే… తప్పకుండా ఈ ప్రాజెక్ట్ కి కొత్త హంగు అబ్బినట్టే.
రాజశేఖర్ ఇటీవల విలన్, ప్రధాన పాత్రలపై దృష్టి పెట్టారు. శర్వానంద్ సినిమా ‘బైకర్’ లో ఆయన కోచ్ పాత్రలో రాణించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్థన’ లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో విలన్ గా కనిపించాలని ఆయనకు ఎప్పటి నుంచో ఉంది. బాలయ్య సినిమా ఆయనకు మంచి ఛాన్స్ ఇవ్వబోతోంది.
బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో మంచు మనోజ్ ని విలన్ పాత్ర కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఇది కూడా క్రేజీ కాంబోనే. మొత్తానికి తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించబోతున్నారు. అలాగైనా కొత్త తరహా విలనిజం చూసే వీలు దక్కుతుంది.
