అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘రాకా’. బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ వదిలారు. అప్పటి నుంచీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ ఎంత వరకూ జరిగింది, ఇంకెంత బాలెన్స్ ఉంది? అనే వివరాలు కూడా బయటకు రాలేదు. షూటింగ్ అంతా ముంబైలో జరుగుతోంది. సో… ఇక్కడి మీడియాకు దొరక్కుండా, లీకులు బయటకు రాకుండా మేనేజ్ చేయగలుగుతున్నారు.
అయితే.. ‘రాకా’ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా గ్లింప్స్ ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. నిజానికి బన్నీ బర్త్ డేకే గ్లింప్స్ వదలాలి. కానీ ఎందుకో చిత్రబృందం ఆ ప్రయత్నం చేయలేదు. ఆగస్టుకి మాత్రం గ్లింప్స్ రావడం పక్కా అని టాక్. ‘రాకా’ వరల్డ్ ఏమిటి, బన్నీ పాత్ర ఎలా ఉంటుంది? మిగిలిన పాత్రలేమిటి? అనే విషయాలకు సంబంధించిన క్లూ ఆ గ్లింప్స్ లో ఉండొచ్చు. రిలీజ్ డేట్ కి సంబంధించిన సమాచారం కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. 2027 డిసెంబరులో ఈ సినిమా వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అది నిజమా, కాదా అనేది గ్లింప్స్ లో తేలిపోతుంది.
ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. రష్మిక, జాన్వీ కపూర్లు కూడా మెరవబోతున్నారని టాక్. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారని టాక్. ఓటీటీ డీల్ కూడా పూర్తయ్యిందని, నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని మంచి రేటుకి కొనేసిందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై కూడా ఓ స్పష్టత రావాల్సివుంది.
