పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి

పంజాబ్ రాష్ట్రంలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై శనివారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటలకు నలుగురు ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. సైనిక దుస్తులు ధరించి అధికారిక వాహనాలలో వచ్చిన ఆ నలుగురు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ తక్షణమే అప్రమత్తమయిన భద్రతా బలగాలు వారి దాడిని తిప్పికొట్టాయి. భద్రత దళాల కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

ఈ సంగతి తెలిసిన వెంటనే హెలికాఫ్టర్లలో అదనపు భద్రతాబలగాలను పఠాన్ కోట్ తరలించినట్లు సరిహద్దు భద్రతా దళాల డి.ఐ.జి. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తెలిపారు. నిన్న నూతన సంవత్సరం రోజున సైనికదుస్తులలో వచ్చిన కొందరు దుండగులు పంజాబ్ కి చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారితో సహా మరో ఇద్దరిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. వారి ముగ్గురినీ ఆ దుండగులు బాగా కొట్టి ఆ తరువాత పఠాన్ కోట్ వద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశః ఈ రెండు సంఘటనలకు ఏదో సంబంధం ఉండి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మిగిలిన ఇద్దరు ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

భారత్-పాక్ సరిహద్దుకు చాలా సమీపంలో ఉన్న పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చాలా కీలకమయిన రక్షణ స్థావరాలలో ఒకటిగా చెప్పవచ్చును. అది పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక జంక్షన్ వంటిది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకి కేవలం 25 కి.మీ. దూరంలో, గురుదాస్ పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి కేవలం 10 కిమీ దూరంలో ఉంది.

తాజా సమాచారం: దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతిలో హతమయ్యారు. ఉగ్రవాదుల దాడుల్లో వైమానిక సిబ్బందికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఉగ్రవాదులు జైషే మహ్మద్ లేదా లష్కరే తాయిబా సంస్థలకు చెందినవారయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. భద్రతాదళాలు పరిసర ప్రాంతాలలో ఇంకా గాలిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవికి కొత్త త‌ల‌నొప్పి

సాధ్య‌మైనంత వ‌ర‌కూ వివాదాల‌కు దూరంగా ఉంటాల‌నుకుంటారు చిరంజీవి. అజాత శ‌త్రువు అని, అంద‌రివాడ‌ని పిలిపించుకోవాల‌ని త‌ప‌న‌. అయితే అప్పుడ‌ప్పుడూ చిరుకి ఝ‌ల‌క్కులు త‌గులుతూనే ఉంటాయి. అనుకోని వివాదాలు ప‌ల‌క‌రిస్తూనే ఉంటాయి. ప్ర‌స్తుతం బాల‌య్య...

మ‌హేష్‌కి విల‌న్‌గా ఉపేంద్ర‌?

మ‌హేష్‌బాబు - ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. `స‌ర్కారువారి పాట‌` అనే పేరు ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌డు ఓ శ‌క్తిమంత‌మైన విల‌న్ కోసం అన్వేషిస్తోంది చిత్ర‌బృందం. మ‌హేష్ బాబు...

కొండారెడ్డి బురుజు.. క‌రోనా క‌ల‌క‌లం

క‌రోనా వ‌ల్ల చిత్ర‌సీమ‌కు ఏదైనా మంచి జ‌రిగిందంటే.. అది ఓ కొత్త జొన‌ర్ పుట్టుకురావ‌డ‌మే. క‌రోనా త‌ర‌వాత‌.. ఈ ఉప‌ద్ర‌వం నేప‌థ్యంలో కొన్ని క‌థ‌లు వ‌స్తాయ‌ని చిత్ర‌సీమ ముందే ఊహించింది. అయితే దానికి...

ప్రైవేటు వైద్యం కోసం హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..!

విశాఖ మానసిక ఆస్పత్రిలో తనను నిజంగానే పిచ్చోడిని చేసే మందులు వేస్తున్నారని భయపడుతున్న నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుధాకర్.. తనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకునేలా వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు...

HOT NEWS

[X] Close
[X] Close