ఏపీలో తగ్గని “పాజిటివ్” దూకుడు.. కౌంట్ 132..!

ఆంధ్రప్రదేశ్ కరోనా కోరల్లో తీవ్రంగా చిక్కుకున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారుతోంది. మెట్రో సిటీలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఏపీలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న రాత్రి నుంచి ఉదయం వరకూ జరిపిన కరోనా అనుమానితుల టెస్టుల్లో కొత్తగా 21 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 132కి చేరింది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఇరవై చొప్పున కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. ఇంకా 493 మంది కరోనా అనుమానితుల శాంపిళ్లు.. ల్యాబుల్లో ఉన్నాయి.

వాటిలో ఎక్కువగా.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థలకు వెళ్లిన వారివే కావడంతో… మరింత ఎక్కువగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశం మొత్తం మీద.. కరోనా వైరస్ కేసులు 2 వేలు చేరుకున్నాయి. కరోనా కారణం చనిపోయిన వారి సంఖ్య 50 దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. దేశం మొత్తం మీద.. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేసి.. హోం క్వారంటైన్‌లోనో ఐసోలేషన్‌లోనే పెట్టిన అధికారులకు.. ఢిల్లీలోని తబ్లిగీ జమాతే .. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారింది.

వారంతా రైళ్లలోనే ప్రయాణం చేయడం.. వారి అడ్రస్సులు స్పష్టంగా లేకపోవడంతో.. వారికి సంబంధించిన ఉన్న వివరాలతోనే ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో బయటపడుతున్న కరోనా కేసులన్నీ… మర్కజ్ ప్రార్థనలకు సంబంధించినవే ఉంటున్నాయి. ప్రతీ రాష్ట్రం నుంచి దాదాపుగా వెయ్యి మంది ఈ ప్రార్థనలకు వెళ్లారు. అందుకే.. రానున్న రోజుల్లో మరిన్ని పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close