ఫ్లాష్ బ్యాక్‌: రంభ బొడ్డుపై పుచ్చ‌కాయ వేస్తే..?

రాఘ‌వేంద్ర‌రావు సినిమాల్లోని పాట‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందేముంది? ఆయ‌న పాట‌ల‌తో పాటు పండ్ల తోట‌లూ చూపించేస్తుంటారు. క‌థానాయిక బొడ్డుపై పళ్లు, పాలు ధార‌లు క‌డుతుంటాయి. సీజ‌న్‌కి త‌గ్గ‌ట్టు… పళ్ల‌తో క‌థానాయిక బొడ్డుని ముస్తాబు చేస్తుంటారు. దీనిపై ఎన్ని జోకులో.

‘బొంబాయి ప్రియుడు’ షూటింగ్ జ‌రుగుతోంది. ‘గుప్పెడు గుండెను త‌డితే.. ఆ చ‌ప్పుడు పేరే సంగీతం’ పాట‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ పాట‌లో భాగంగా రంభ బొడ్డుపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి బ‌త్తాయి పండు వేయాలి. షాట్ ఓకే అయిపోయింది. నెక్ట్స్ షాట్‌కి రెడీ అవుతుంటే… ‘ఇప్పుడు నీ బొడ్డుపై బ‌త్తాయి వేయించారు. రేపో మాపో పుచ్చ‌కాయ కూడా వేయించేస్తారు’ అన్నాడ‌ట జేడీ. అది విని రంభ భ‌ళ్లున న‌వ్వింది. అది చూసిన రాఘ‌వేంద్ర‌రావుకి కోపం వ‌చ్చింది. ‘మీ న‌వ్వుల‌న్నీ అయిపోయాక చెప్పండి.. నెక్ట్స్ షాట్ తీసుకుంటా’ అని అక్క‌డి నుంచి రుస‌రుస‌మంటూ వెళ్లిపోయార్ట‌. రాఘ‌వేంద్ర‌రావు అలా ప్ర‌వ‌ర్తించేస‌రికి.. రంభ మ‌న‌సు చివుక్కుమంది. అంతే.. సెట్లోనే ఏడ్చేసింద‌ట‌. రాఘ‌వేంద్ర‌రావు కోపం, రంభ ఏడుపు వ‌ల్ల‌.. ఆ రోజు షూటింగ్ పూర్త‌వ్వ‌కుండానే పేక‌ప్ చెప్పేశార్ట‌. మ‌రుస‌టి రోజు రాఘ‌వేంద్ర‌రావు సెట్‌కి వ‌చ్చిన వెంట‌నే “నిన్న జ‌రిగిన దానికి నా త‌ప్పేమీ లేదండీ. అన‌వ‌స‌రంగా నాపై మీరు కోప్ప‌డ్డారు” అంటూ మ‌ళ్లీ ఏడుపు అందుకుంద‌ట రంభ‌. రాఘ‌వేంద్ర‌రావు కూడా దాన్ని తేలిగ్గా తీసుకుని “నిన్న‌టి సంగ‌తి నిన్నే మ‌ర్చిపోయాను. ఈరోజు నువ్వు ఓకే అంటే నీ బొడ్డుపై పుచ్చ‌కాయ ఏంటి? గుమ్మ‌డి కాయే విసిరేస్తా” అన్నార్ట‌. దాంతో ఆ బాధ మ‌ర్చిపోయి గ‌ల గ‌ల న‌వ్వేసింద‌ట రంభ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close