ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ ద‌ర్శ‌కుడితో ‘కిష్కింద పురి’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా మ‌రో రెండు క‌థ‌లు ఓకే చేశాడు. ఇప్పుడు మ‌రో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా బెల్లంకొండ‌కు స‌మ్‌థింగ్ స్పెష‌ల్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. దాదాపు రూ.50 కోట్ల భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లుధీర్ బైరెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఇదో సోషియో ఫాంట‌సీ, అడ్వంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ అని టాక్‌.

ఈ క‌థ‌ని యేడాది క్రిత‌మే బెల్లంకొండ ఓకే చేశాడు. అప్ప‌టి నుంచీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతూనే ఉంది. అయితే స‌రైన ప్రొడ‌క్ష‌న్ హౌస్ కోసం బెల్లంకొండ ఎదురు చూశాడు. ఇప్పుడు ఈ క‌థ‌ని న‌మ్మి, అందుకు త‌గిన పెట్టుబ‌డి పెట్టే నిర్మాణ సంస్థ టీమ్‌లో జాయిన్ అయ్యింది. మూన్ షైన్ పిక్చ‌ర్స్‌, షైన్ స్క్రీన్స్ సంస్థ‌ల‌తో రెండు సినిమాలు చేస్తున్నాన‌ని ఇటీవ‌ల బెల్లంకొండ ప్ర‌క‌టించాడు. ఈ బ్యాన‌ర్‌ల‌లో ఒక‌దానిపై ఈ రూ.50 కోట్ల సినిమా రాబోతోంది. ఈ చిత్రంలో పేరున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌ని చేయ‌బోతున్నారు. వాళ్ల వివ‌రాలు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. లుధీర్‌కి ఇదే తొలి సినిమా. రూ.50 కోట్ల ప్రాజెక్ట్ ని ఓ కొత్త ద‌ర్శ‌కుడి చేతిలో పెట్టారంటే బెల్లంకొండ ఈ క‌థ‌ని ఎంత గ‌ట్టిగా న‌మ్మాడో అర్థం అవుతోంది. జూన్ లేదా జులైలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా ఓ మంచి రోజు చూసుకొని, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close