ఏపీలో 40కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు ..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. నిన్న రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనుమానితులకు జరిపిన టెస్టుల్లో ఏకంగా పదిహేడు మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ రోగుల సంఖ్య 40కి చేరింది. ఈ పదిహేడు మందిలో అత్యధికం.. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లిన వారు.. వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకిన వారు.  అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 మందికి వైరస్ సోకింది. గుంటూరు జిల్లాలో తొమ్మిది, విశాఖ జిల్లాలో ఆరు, కృష్ణా జిల్లాలో ఐదు మందికి.. తూర్పుగోదావరిజిల్లాలో నలుగురు, అంతపురం జిల్లాలో ఇద్దరికి చిత్తూరు, నెల్లూరు, కర్నూల్లో ఒక్కొక్కిరి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని అధికారులు గుర్తించడంతో ..అలా ప్రార్థనలకు వెళ్లిన వారందర్నీ అధికారులు గుర్తించేందుకు తంటాలు పడుతున్నారు. దాదాపుగా ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈ మత సమావేశాలకు వెళ్లారని.. వీరి సంఖ్య ఐదువందల వరకూ ఉంటుందనే సమాచారం ప్రభుత్వానికి అందింది. వీరు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనేక రకాల మత సమావేశాలతో పాటు.. వివిధ ఫంక్షన్లకు హాజరయ్యారు. ఈ కారణంగా.. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉంటుందని అధికారవర్గాలు టెన్షన్ పడుతున్నాయి.

కాంటాక్ట్ కేసులు ఏపీలో అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లిన వచ్చిన వారి దగ్గర్నుంచి సులువుగా..ఈ కోవిడ్.. ఇతరులకు వ్యాపిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిపై ఎక్కువగా దృష్టి పెట్టిన అధికారులు.. ఢిల్లీ నుంచి వచ్చిన వారిని లైట్ తీసుకున్నారు. దీంతో.. ముప్పు మరో వైపు నుంచి ముంచుకొచ్చింది. వివిధజిల్లాల్లో పెద్ద ఎత్తున అనుమానితులు ఆస్పత్రులకు వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారితో సన్నిహితంగా ఉన్న వారే. దీంతో పాటిటివ్ కేసులు మరింత పెరుగుతాయన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close