కరోనా కష్టాలు… తీరని జిహ్వ ఛాపల్యాలు

రిపోర్టర్ ; ఎక్కడి నుంచి వచ్చారు
పౌరుడు; శ్రీ నగర్ కాలనీ నుంచి
ఎందుకు; గోధుమ పిండి కోసం
రిపోర్టర్ ; శ్రీ నగర్ కాలనీలో దొరకడం లేదా?
పౌరుడు; అక్కడ ఆశీర్వాద్ దొరకలేదు…

ఇదీ లాక్ డౌన్ వేళ కనిపించిన, నవ్వించిన సన్నివేశం. దీని మీద ఇప్పుడు ఎన్ని జోకులో, ఎన్ని మీమ్సో. తెలుగువాళ్లంతే. మాంఛి భోజన ప్రియులు. వాళ్ల జిహ్వ చాపల్యాల గురించి కథలు కథలుగా చెప్పుకోవొచ్చు. ఇప్పుడు కళ్లెదుట కనిపిస్తున్నాయి కూడా. గోధుమ పిండి కోసం శ్రీనగర్ కాలనీ నుంచి చింతలబస్తీ వెళ్లాడో యువకుడు. అది కూడా కరోనా భయం వెంటాడుతున్న వేళ. దీన్ని జోక్ గా తీసుకుని నవ్వేసుకుంటున్నారు గానీ, ప్రాణం మీదకి వచ్చిన వేళ నోరు కూడా కట్టేసుకోని మన అస్సహాయతని, బలహీనతని అత్యంత బలంగా చూపించిన ఉదాహరణలో ఇదొకటి.

తెలుగు వారు భోజన ప్రియులు. అందుకే.. పల్లెటూర్లలో కూడా కర్రీ పాయింట్లు వెలుస్తున్నాయి. అడుగుకో రెస్టారెంటు కనిపిస్తోంది. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో స్విగ్గీ, జొమోటో బళ్లు విచ్చల విడిగా తిరిగేస్తుంటాయి. బిర్యాని కోసం నగరమంతా గాలించే వాళ్లెందరో. అర్థరాత్రి అలా తీరిగ్గా బండి మీద జామ్ జామ్ అంటూ వెళ్లి ఐస్ క్రీమ్ లాగించేసేవాళ్లూ ఉన్నారు. అందుకే హైదరాబాద్ లో తెల్లవార్లూ ఐస్ క్రిమ్ పార్లర్లు తెరచుకుని కూర్చుంటాయి. ఎవరి వ్యాపారం వాళ్లది.

ఇప్పుడు ఆ సరదాలూ, షికార్లూ అన్నీ బంద్ అయ్యాయి. రుచులన్నీ దూరమయ్యాయి. చుక్క దొరక్కపోతే మందు బాబులు ఎంతగా విలవిలలాడిపోతారో, భోజన ప్రియులు కూడా అలానే తయారైపోతున్నారిప్పుడు. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటి వాళ్లు ఇలాంటి రోజుల్లోనూ కక్కా, ముక్కా, చేప అంటూ సంచులు పట్టుకుని బయల్దేరుతున్నారు. ఈ ఆదివారం కిలో మటన్ రూ.1000కి పలికింది. సాధారణ రోజుల్లో ఆరొందలు ఉండే మటన్ ధరని అదును చూసుకుని 1000కి పెంచేశారు. అయినా మన వాళ్లు తగ్గలేదు. మొన్నటి వరకూ చికెన్ అంటే చిచ్చీ అనేవాళ్లు. కరోనా చికెన్ వల్ల కూడా వస్తుందన్న భయం ఉండేది. అందుకే చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. కిలో 40 రూపాయలకు అమ్ముతున్నా ఎవ్వరూ కొనేవాళ్లు కాదు. కొన్ని చోట్ల… కోళ్లు ఉచితంగా సరఫరా చేశారు. చికెన్ తింటే కరోనా రాదు మొర్రో అన్నా… కన్నెత్తి చూడలేదెవరు.

ఇప్పుడు పరిస్థితి మారింది. కిలో చికెన్ 200 కి వెళ్లిపోయింది. ఇదంతా భోజన ప్రియుల వల్లే. నోటిని ఎవ్వరూ కట్టేసుకోమనడం లేదు. కానీ…. ఆ చికెనూ, మటనూ కోసం క్యూ లో నిలబడి, ఎగబడుతుంటేనే భయం వేస్తుంటుంది. చికెన్ కొసమో, మటన్ కోసమో బయటకు వెళ్లి, కరోనాకి మరింత దగ్గరవుతున్నారనే ఆందోళన. కొన్ని రోజులు నోరు కట్టేసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు కదా. ఇంట్లో కూర్చుని, క్షేమంగా కలో గంజో తాగితే.. అది అద్భుతమే కదా. కరోనా వల్ల చాలా మంది జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. తినడానికి తిండి లేక కడుపు మాడ్చుకుంటున్నవాళ్లెంతోమంది. వాళ్ల కంటే.. మనం చాలా బెటర్ కదా? కరోనా తీవ్రత ఎక్కువై, నిత్యావసర వస్తువులు కూడా అందనివ్వకుండా బంద్ పాటించమంటే.. అప్పుడు ఆనందమా?

ఇప్పుడు రుచులు కాదు .. ప్రాణాలు ముఖ్యం. నాలుగు వేళ్లూ, ఏదోలా నోట్లోకి వెళ్లడమే.. మన సౌభాగ్యం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మన వల్ల, కేవలం మన వల్ల.. ఎవ్వరికీ ఎలాంటి నష్టం జరక్కూడదు. అది మాత్రం కాస్త గట్టిగా ఆలోచించుకోండి. బోర్డరుకు వెళ్లి గన్ను పట్టుకొని ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేుదు. జస్ట్ కొన్ని కోరికలు అదుపులో ఉంచుకుంటే చాలు. ఇది కూడా చేయలేకపోతే ఇక మన ఖర్మ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close