హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూమి ధరలు గత సంవత్సరంలో 20 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. సెప్టెంబర్ 2025లో రిజిస్ట్రేషన్లు 35 శాతం పెరిగి 6,612 యూనిట్లకు చేరాయి. ప్రీమియం హౌసింగ్‌లో రూ.1 కోటి మించిన ఆస్తులు)పై డిమాండ్ బలపడటంతో ఈ పెరుగుదల సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి జోన్లో ధరలు 28% పెరగటంతో ఇది రెసిడెన్షియల్, కమర్షియల్ కొనుగోళ్లకు ప్రధాన హబ్‌గా మారిందని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
హైదరాబాద్ మార్కెట్ ప్రీమియం, స్పేసియస్ హోమ్‌లపై డిమాండ్ బలపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఐటీ హబ్‌లు, మెట్రో ఫేజ్-II, రింగ్ రోడ్ ప్రాజెక్టులు ప్రతిపాదిత ప్రాంతాల్లో భూమి ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. గత ఏడాది 2024 తో పోలిస్తే, 2025లో హైదరాబాద్ మార్కెట్ 4.8% నుంచి 20% వరకు ధర పెరుగుదలను చూపింది. ఈ పెరుగుదల ఇళ్ల కొనుగోలుదారులకు స్వల్పకాలిక సవాలుగా మారినా, లాంగ్-టర్మ్ పెట్టుబడులకు మంచి అవకాశాలు అందిస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ డిమాండ్ పెరగటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు.
హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పుడు బ్రాండెడ్ రియల్టర్లు కేవలం లగ్జరీ ఇళ్లనే నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కోరుకునే ఇళ్లను నిర్మించడం లేదు. కనీసం కోటిన్నర పెట్టనిదే ఇలాంటి రియల్ ఎస్టేట్ గ్రూపులు కట్టే ప్రాజెక్టుల్లో కొనడం కష్టంగా మారింది. పెద్దగా పేరు లేని చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం.. మధ్యతరగతిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలుచేస్తున్నారు.
