బాక్సాఫీస్ మంత్లీ రిపోర్ట్‌: మార్చిలో ఫెయిల్ అయిన టాలీవుడ్‌

2017 క్యాలెండ‌ర్‌లో అప్పుడే మూడు నెల‌లు వెళ్లిపోయాయి. జ‌న‌వ‌రిలో సంక్రాంతి సినిమాల‌తో హ‌డావుడి చేసిన టాలీవుడ్‌కి ఫిబ్ర‌వ‌రిలో మిశ్ర‌మ ఫ‌లితాలు ఎదుర‌య్యాయి. మార్చిలో అయితే ఏకంగా డింకీ కొట్టేసింది. తొలి రెండు నెల‌ల‌తో పోలిస్తే… టాలీవుడ్ తీరు అధ్వానంగా తయారైంది. ఈనెల‌లో దాదాపుగా 20 సినిమాలు విడుద‌లయ్యాయి. అందులో ఒక్క‌టంటే ఒక్క హిట్టూ లేదు. కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్త కాస్త హ‌డావుడి చేసినా.. అనుకొన్నంత మేర వ‌సూళ్లు సాధించ‌లేక పోయింది. గురుకి మాత్రం కాస్త పాజిటీవ్ టాక్ వ‌చ్చిందంతే.

ద్వార‌క‌, గుంటూరోడు, చిత్రాంగ‌ద‌, ల‌క్ష్మీ బాంబ్‌, మా అబ్బాయి, నేనోర‌కం, పిచ్చ‌గా న‌చ్చావ్‌, కన్న‌య్య‌, సినీ మ‌హాల్‌… ఇలా రావ‌డానికైతే చాలా సినిమాలొచ్చాయి. వీటిలో అల్మోస్ట్ అన్నీ డిజాస్ట‌ర్లే. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆశ‌లు పెంచుకొన్న కాట‌మ‌రాయుడు కూడా బాక్సాఫీసుని ఏమాత్రం ప్ర‌భావితం చేయ‌లేకపోయింది. తొలిరోజు వ‌సూళ్ల‌తో దుమ్ము రేపినా.. ఆ జోరు కొన‌సాగించ‌లేక‌పోయింది. ఈ వారం గురు, రోగ్ వ‌చ్చాయి. గురుకి పాజిటీవ్ టాక్ వ‌చ్చినా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏమాత్రం నిల‌బ‌డ‌గ‌ల‌దు? ఎన్ని వ‌సూళ్లు తెచ్చుకోగ‌ల‌ద‌న్న‌ది అనుమాన‌మే. తక్కువ బ‌డ్జెట్‌లో తీసిన సినిమా కాబ‌ట్టి… వ‌సూళ్ల ప‌రంగా గ‌ట్టెక్కొచ్చు. ఇక రోగ్‌కి బీభ‌త్స‌మైన నెగిటీవ్ టాక్ వ‌చ్చింది. బీ, సీ సెంటర్ల‌లోనూ ఈ సినిమా ప్ర‌భావం అంతంత మాత్ర‌మే. మొత్తానికి మార్చిలో చిత్ర‌ప‌రిశ్ర‌మ భారీ న‌ష్టాల్ని మూట‌గ‌ట్టుకోవాల్సివ‌చ్చింది. మరీ ముఖ్యంగా కాట‌మ‌రాయుడు ఎఫెక్ట్ నుంచి తేరుకోవ‌డానికి బ‌య్య‌ర్ల‌కు చాలా టైమ్ ప‌ట్టేయొచ్చు.

ఏప్రిల్‌లో బాహుబ‌లి 2దే హ‌వా. బాహుబ‌లిని దృష్టి లో ఉంచుకోవ‌డం వ‌ల్ల‌.. పెద్ద సినిమాలేవీ బాహుబ‌లికి ముందు 15 రోజులు.. త‌ర‌వాత 15 రోజులు విరామం తీసుకొన్నాయి. అంటే.. బాహుబ‌లి త‌ప్ప ఈమ‌ధ్య కాలంలో పెద్ద సినిమా ఏదీ విడుద‌ల కాక‌పోవొచ్చు. చెలియ‌, మిస్ట‌ర్ ఈ రెండు సినిమాల‌పై కాస్తో కూస్తో ఆశ‌లున్నాయి. మ‌ణిర‌త్నం – కార్తిల చెలియా ఈనెల 7న రాబోతోంది. మిస్ట‌ర్ 14న వ‌స్తున్నాడు. ఇక బాహుబ‌లి 28న విడుద‌ల‌కు స‌మాయాత్తం అవుతోంది. సో… బాక్సాఫీసు ద‌గ్గ‌ర మెరుపులు చూడాలంటే.. బాహుబ‌లి రావాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close