జగన్‌ అనుభవం- లోకేశ్‌కు లాభం

చంద్రబాబు నాయుడు మంత్రివర్గ మార్పులు అలుకలు, బుజ్జగింపులు వగైరాలపై కథనాలు నడుస్తున్నాయి. లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం వూహించిందే గాని దేశమంతటా ప్రాంతీయ పార్టీల భగవద్గీత ప్రకారమే జరిగింది. ఒమర్‌ అబ్డుల్లా, కుమారస్వామి, అఖిలేష్‌ యాదవ్‌, ఓం ప్రకాశ్‌ చౌతాలా ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కుమారుల సంఖ్య సుమారుగానే వుంది. ఇక పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ,కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ వంటివారు ఉప ముఖ్యమంత్రుల వరకూ ఎదిగారు. ఈ జాబితాలోకి వచ్చేవారు ఇంకా వుండొచ్చు కూడా. కాని ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం తండ్రి ముఖ్యమంత్రిగా వుంటే కుమారుడు మంత్రి కావడం గతంలో జరగలేదు. అల్లుళ్లు మంత్రులైన ఉదాహరణలున్నాయి. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన కుమారుడైన కెటిఆర్‌ను కూడా అల్లుడు హరీశ్‌రావుతో పాటు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎపిలో మొదటి సారి అమరావతిలో చంద్రబాబు ఆ పనిచేశారు. ఇందుకు కారణమేమిటని పరిశీలిస్తే వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచినేర్చుకున్న పాఠమేనని చెప్పాలి. వైఎస్‌ మరణానంతరం జగన్‌ తిరుగుబాటు చేసినపుడు చాలా మంది నేతలు కాంగ్రెస్‌లోనే వుంటే ఆయన ఎప్పటికీ అధికారంలోకి రాలేడని చెబుతుండేవారు. ఒక్క ముఖ్యమంత్రి కుమారుడైనా తండ్రి వుండగా మంత్రివర్గంలోకి రాగలిగారా అని ప్రశ్నించేవారు. మర్రి శశిధరరెడ్డి, జలగం వెంకటరావు, కోట్ల సూర్యప్రకాశరెడ్డి వంటి వారంతా అరకొర పదవులతో తృప్తిపడటం తప్ప నాయకత్వంలోకి రాలేకపోయారనీ,జగన్‌ అలా కాకూడదనుకుంటే ఏదో ఒక పోరాటం చేస్తుండవలసిందేనని వైసీపీ నేతలు చెబుతుండేవారు. ఇంచుమించి చంద్రబాబు నాయుడు కూడా ఆ సూత్రాన్నే అనుసరించారు. తను వుండగానే లోకేశ్‌ను మంత్రిని చేస్తే తన తర్వాత ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశ, ఆశయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close