ఇంటర్వెల్ తరువాత మళ్ళీ కాంగ్రెస్ ప్రత్యేక పోరాటం

రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని యూపియే ప్రభుత్వం పార్లమెంటులో నోటి మాటగా హామీ ఇవ్వడం, దానిని అప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న భాజపా గట్టిగా బలపరచడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో గత ఎన్నికల సమయంలోనే బయటపడింది. చెట్టు పేరు చెప్పుకొని పళ్ళు అమ్ముకొన్నట్లుగా ప్రత్యేక హోదా పేరు చెప్పుకొని కాంగ్రెస్, భాజపాలు ఓట్లు పిండుకోవాలని ప్రయత్నించాయి.

అలాగే ప్రత్యేక హోదా వలన ఆశించిన ప్రయోజనం ఒకటయితే జరుగుతున్నది మరొకటి. దాని వలన రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి జరగాల్సి ఉండగా, నేటికీ ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంతో రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానిని ‘ఆక్సిజన్’ గా వాడేసుకొంటూ ప్రాణాలతో బ్రతికి బయటపడాలని ప్రయత్నిస్తోంది.

ఈ ‘ప్రత్యేక సమస్య’తో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అగ్ని పరీక్షలు పెట్టి, ఆయనను నిత్యం తిట్టిపోయడానికి జగన్మోహన్ రెడ్డి ఇది చాలా ఉపయోగపడుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే ఆ రెండు పార్టీలు తమ మనుగడకి వేరే సమస్య కోసం వెతుక్కోవలసి వచ్చేది కానీ ప్రధాని నరేంద్ర మోడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యమాని వాటికి ఆ ఇబ్బంది తప్పింది. అవి ప్రభుత్వంతో పోరాడటానికి చేతిలో మరే సమస్య లేనప్పుడు ‘స్టాండ్ బై’లో ఉన్న ఈ ప్రత్యేక సమస్య అక్కరకు వస్తుంటుంది. ఎవ్వర్ గ్రీన్ సబ్జక్ట్ అయిన దానిపై ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఉద్యమించే వెసులుబాటు ఏర్పడింది.

దీనిని మొదట గుర్తించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే. కనుక రాష్ట్రం కోసం కాకపోయినా ఆ పేరు చెప్పుకొని జీవచ్చవంగా మారిన తమ పార్టీకి దీనితో ఊపిరి ఊది బ్రతికించుకొనేందుకు పోరాటం మొదలుపెట్టింది. దాని కోసం గుంటూరు, తిరుపతిలో సభలు పెట్టి హడావుడి చేసింది. దానితో పార్టీని బ్రతికించుకోలేకపోయింది కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సజీవ దహనం అయిపోయాడు. ఆ తరువాత చిన్న బ్రేక్ తీసుకొని వైకాపాకి ఆ ‘లీడ్’ అందించడం జరిగింది.

రాహుల్ గాంధీ ఇచ్చిన హింట్ ని జగన్మోహన్ రెడ్డి బాగానే క్యాచ్ చేసారు. కానీ అతనికి కాస్త దూకుడు ఎక్కువవడం చేత ఆ ‘ప్రత్యేక బ్రహాస్త్రాన్ని’ సరిగ్గా ప్రయోగించలేక మధ్యలోనే అస్త్ర సన్యాసం చేసారు. ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక ఇంటర్వెల్ పడింది. ఇంటర్వెల్ తరువాత ప్రధాని నరేంద్ర మోడి ఇచ్చిన స్పూర్తితో రఘువీరా రెడ్డి ‘ప్రత్యేక మట్టి సత్యాగ్రహం’ టైటిల్ తో మళ్ళీ దానిని రీస్టార్ట్ చేసారు. కానీ దాని వలన కూడా ప్రత్యేక హోదా మంజూరు కాలేదు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో కూడా ఏ మాత్రం మార్పు కనబడలేదు పైగా ఇంకా ఖాళీ అయిపోయింది.

మళ్ళీ కొన్ని నెలలు ప్రత్యేక ఇంటర్వెల్ తీసుకొన్నాక తరువాత ఇవాళ్ళ మళ్ళీ దానిని రీస్టార్ట్ చేసారు. ప్రత్యేక హోదా కోసమో లేకపోతే డిల్లీలో ఉన్న తమ అధిష్టాన దేవతల మెప్పు పొందడానికో తెలియదు గానీ రఘువీరా రెడ్డి, శైలజానాథ్ మరో 300 మంది అనామక కాంగ్రెస్ కార్యకర్తలను వెంటబెట్టుకొని ‘ఛలో డిల్లీ’ అంటూ అందరూ విశాఖలో రైలెక్కేశారు. మూడు రోజులపాటు డిల్లీలో ఉండి రాష్ట్రపతి, ప్రధాని, లోక్ సభ స్పీకర్ వంటి ప్రభుత్వ పెద్దలను అందరినీ కలిసి ప్రత్యేక హోదా+ఇతర హామీల సంగతిని వారికి మరొక్కమారు గుర్తు చేసి వస్తామని రఘువీరుడు చెప్పారు. పనిలోపనిగా తమ అధిష్టాన దేవతలను కూడా కలిసి తమ ఈ ‘కష్టాన్ని’ వారి దృష్టిలో కూడా పడేస్తారుట.

ఇదంతా రాష్ట్రం బాగుకోరే చేస్తున్నదేనని వారు చెపుతున్నారు. అలాగ అనుకోవడం వలన రాష్ట్ర ప్రజలకు కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు…పైగా చంద్రబాబు నాయుడు ఎలాగూ ఆ పని చేయ(లే)రు కనుక కొండకు వెంట్రుక ముడేసిలాగే తమ ఈ ప్రయత్నాలకి రాష్ట్ర ప్రజలు కూడా అభ్యంతరం చెప్పబోరని వారికీ తెలుసు కనుక ఛలో డిల్లీ అని అందరూ బయలుదేరిపోయారు.

తరువాత మళ్ళీ దీనికి ఎన్ని రోజులు ఇంటర్వెల్ పడుతుందో, కాంగ్రెస్, వైకాపాలలో మళ్ళీ ఏ పార్టీ ‘లీడ్’ తీసుకొంటుందో చూడాలి. ప్రత్యేక హోదా వలన రాష్ట్రానికి మేలు జరుగుతుందో లేదో అది వస్తే గానీ తెలియదు కానీ అది రాకపోతే ప్రతిపక్ష పార్టీలకి మేలు జరుగుతుందని స్పష్టం అవుతోంది. వాటికి నష్టం కలిగించే ఆ పని మోడీ ప్రభుత్వం ఎన్నడూ చేయదని అందరికీ తెలుసు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాపం ఏపీ ఉద్యోగులు..! పండగకు డీఏల్లేవ్.. జీతం బకాయిల్లేవ్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్నట్లుగా మారింది. ఆరున్నరేళ్ల కిందట.. రాష్ట్రం విడిపోయిన కొత్తలో.. కష్టాలున్నా.. చంద్రబాబు 44 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఇచ్చారు. ఆ తర్వాత...

రివ్యూ: క‌ల‌ర్ ఫొటో

తెలుగు360 రేటింగ్ : 2.75/5 సినిమా ప్రేమ‌ల‌కు ఎన్ని అవ‌రోధాలో. కులం, డ‌బ్బు, మ‌తం, ప్రాంతం, దేశం - అన్నీ అడ్డుప‌డుతుంటాయి. వాట‌ని దాటుకుని ప్రేమికులు ఎలా క‌లిశార‌న్న‌దే క‌థ‌లవుతుంటాయి. ఇప్పుడు ఈ...

రైతు ఉద్యమానికి తలొగ్గిన కేసీఆర్..!

సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తొలి సారి వెనక్కి తగ్గారు. తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. నిన్నటి వరకూ కేసీఆర్... మక్కలకు...

ఇక పోలవరానికి పైసా కూడా ఇవ్వరా..!?

పోలవరం విషయంలో కేంద్రం నిధులకు పూర్తి స్థాయిలో కొర్రీలు పెడుతూండటంతో ఏపీ సర్కార్ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇక తప్పదన్నట్లుగా గత ప్రభుత్వంపై నెట్టేస్తే సరిపోతుదన్న వ్యూహానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ఆర్థిక...

HOT NEWS

[X] Close
[X] Close