బిజెపికి కాపు ఫ్యాక్టర్ బలం?

తెలుగుదేశం కాలుదువ్వితే తప్ప వచ్చే సాధారణ ఎన్నికల వరకూ రాష్ట్రప్రభుత్వానికీ కేంద్ర ప్రభుత్వానికీ మధ్య సంబంధాల్లో మార్పు వుండదు. అయితే కేంద్రంతో, ఆమాటకొస్తే మరెవరితో అయినాగాని తగాదా పెట్టుకునే అవకాశం స్వాభావికంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేదు.

అయితే తెలుగుదేశం, బిజెపి పార్టీల మధ్య సంబంధాల్లో ఇప్పటి పరిస్ధితి వుండదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో వున్న కులాల కెమిస్ట్రీ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో లేదు. అప్పట్లో స్ధూలంగా రెడ్లు, కాపులు, బలహీన వర్గాల వారు ఒక శిబిరంగా, కమ్మవారు, బిసిలు మరో శిబిరంగా పరస్పరం నిరంతరం పోటీ పడుతూ వుండేవారు. విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ఆర్ధిక వ్యత్యాసాలతో సంఖ్యా పరంగా కాపుల ప్రాబల్యం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా వుంది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గలో ఐదుగురు కాపులు వున్నప్పటికీ వారెవరికీ సొంత కులం మీద తిరుగులేని నాయకత్వ పటిమలేదు. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఉద్యమం కూడా చంద్రబాబు నాయుడు కులంపై కాపుల్లో మొదటి నుంచీ వున్న వైరుధ్యాన్ని ఎగదోసింది.

ఎత్తుగడల్లో, వ్యూహాల్లో దెబ్బతింటూ వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపు, కమ్మల గ్యాప్ ని తన పార్టీకి అనుకూలంగా మార్చుకోగలరా అన్నది అనుమానమే!

ఈ పరిస్ధితిని బిజెపి తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజుకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగించడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని తన పవర్ సెంటర్ వైపు ఆకర్షించాలన్నది వీర్రాజు ప్రొజెక్ట్ చేయడంలో బిజెపి ఎత్తుగడగా అర్ధమౌతోంది.

వీర్రాజు మాటల కరకుతనం బిజెపి తెలుగుదేశాల మధ్య సంబంధాలను తెంపేసే విధంగా వుండదు. అదే సమయంలో తెలుగుదేశాన్ని నోరు జారనివ్వకుండా ఒక కంట్రోలర్ గా కూడా వీర్రాజు వ్యవహరిస్తారు. అంటే తెలుగుదేశంతో వీలైనంతవరకూ తగాదా లేకుండా, ప్రజల్లో ముఖ్యంగా బలమైన సామాజిక వర్గంగా వున్న కాపుల్లో ఆదరణ పెంచుకునే ద్విముఖ వ్యూహంతో బిజెపి ఇక మీదట వ్యవహరిస్తుంది.

అయితే ఇది అంత తేలికైన విషయం కాదు. బిజెపి ఆంధ్రప్రదేశ్ కు నమ్మక ద్రోహం చేసిందన్న అభిప్రాయం సామాన్యుల్లో కూడావుంది. రాజకీయాల పట్ల తటస్ధత పాటించే విద్యావంతులు, ఆలోచనాపరులు, మధ్యతరగతి వారిలో బిజెపి పట్ల వ్యతిరేకత మొదలైంది…కాపుల విషయంలో బిజెపికి వున్న అనుకూలత – ఏపికి బిజెపి ద్రోహం చేయడం వలన ఒక వ్యతిరేకతగా మారిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close