ఏపీలో “3 రాజధానుల ఉద్యమకారులు”.. అక్కడ “స్థానికులు”..!

అన్యాయం జరుగుతోందని ఆందోళనకు దిగిన రైతుల విషయంలో ప్రభుత్వాలు.. ఆయా అధికార పార్టీలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ… ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తున్న వారిని వెనక్కి పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో… జనవరి 26న ఎర్ర కోట కేంద్రంగా జరిగిన అరాచకాన్ని రైతులపైకి నెట్టేసి విపరీతమైన ప్రచారం చేసి.. ప్రజల్లో వారి ఉద్యమంపై సానుభూతిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంత మంది “స్థానికుల” పేరుతో రచ్చ ప్రారంభించారు. ఢిల్లీలో శివారు స్థానికులమంటూ… రైతుల శిబిరాలపై దాడులు చేయడం పెరిగిపోయింది. కొంత మంది ధర్నాలు చేస్తున్నారు. రైతులు అక్కడ్నుంచి ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఈ స్థానికులు ఎవరన్నదానిపైనే ఇప్పుడు వివాదం ప్రారంభమయింది. వారంతా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలని ఆరోపణలు వినిపించడం ప్రారంభమయ్యాయి. అయితే వారిని స్థానికులు అంటూ మీడియా కూడా ఏకపక్షంగా చెబుతోంది. రైతులు… స్థానికుల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు … అలాంటప్పుడు… స్థానికులు రైతులకు వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు చేస్తారన్నది ఊహకు అందే లాజిక్కే. అదే సమయంలో రైతులకు మౌలిక సదుపాయాలు అందకుండా చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం శక్తివంచన లేకుండా చేస్తోంది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రైతులకు అదనంగా మరికొంత మంది వచ్చిచేరుతున్నారు కానీ.. తగ్గడం లేదు. పైగా ఇది ఉత్తరాదిలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న వర్గాన్ని అసహనానికి గురి చేస్తూండటంతో … వారిని దూరం చేసుకోలేక బీజేపీ.. బలవంతంగా ఖాళీ చేయించే ఉద్దేశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా చెబుతున్నారు.

ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితే… ఏపీలోని అమరావతి రైతులకు వచ్చింది. నాలుగు వందల రోజులకుపైగాఉద్యమం చేస్తున్న రైతులపైకి ఇటీవల… మూడు రాజధానుల మద్దతు దారుల పేరుతో కొంత మందిని రంగప్రవేశం చేయించారు. ఇతర ప్రాంతాల నుంచి రోజువారీగా తీసుకువస్తున్న వారు అక్కడ పోటీగా ధర్నాలు చేస్తున్నారు. వారికి పోలీసులు మద్దతిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు… మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం.. అధికార పార్టీనే ఆ ఉద్యమాన్ని స్పాన్సర్ చేసిందనే ఆరోపణలు సహజంగానే వచ్చాయి. అమరావతిలో మూడు రాజధానుల ఉద్యమకారుల పేరుతో.. ఢిల్లీలో స్థానికుల పేరుతో .. రైతులపైనే రివర్స్ వ్యూహం అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

బస్సు యాత్ర అసాంతం విపక్షాలపై ఏడుపే !

జగన్ బస్సు యాత్ర ముగిసింది. రోజు మార్చి రోజు విరామం తీసుకుంటూ.. ఓ ఇరవై పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేయడానికి పాతిక రోజుల సమయం తీసుకున్నారు. ఏసీ బస్సు నుంచి...

అయితే పోతిన లేకపోతే పోసాని – పిచ్చెక్కిపోతున్న వైసీపీ !

పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని...

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close