30 పార్టీల తమిళనాడులో తొలిసారి బహుముఖ పోటీలు !

తమిళనాడులో ముప్పై ఏళ్ళుగా ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ద్రవిడపార్టీల ప్రాబల్యానికి ఈ ఎన్నికల్లో గండిపడే సూచనలు కనబడుతున్నాయి. ప్రధాన పార్టీలకు మిత్రపక్షాలు, లేదా ప్రత్యర్ధి పక్షాలుగానో పేరు తప్ప ప్రత్యేకమైన గుర్తింపూ, ప్రాబల్యం లేని 28 చిన్న పార్టీలు, గ్రూపుల ప్రాబల్యం ప్రజల్లో కాస్త పెరిగింది. ముప్పైకి పైబడిన ప్రధాన ద్రవిడ పార్టీలు, జాతీయ పార్టీలు, చిన్నచిన్న పార్టీలు కలిపి కొన్ని కూటములుగా పోటీ చేసినా బహుముఖపోటీలు తప్పవు. ఇందువల్ల పెద్దపార్టీలు బలహీనమై చిన్నపార్టీల మద్దతు లేకపోతే ప్రభుత్వాలు నిలబడలేని హంగ్ వాతావరణం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

234 సీట్లు వున్న తమిళనాడు అసెంబ్లీలో ఇపుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కి కేవలం 5 స్థానాలు మాత్రమే వుండగా, బీజేపీకి ఒక్కటి కూడా లేదు. 2011లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 2.2 శాతం ఓట్లు రాగా, 2014లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కి 4.3 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఏఐడీఎంకె కి 149, కరుణానిధి సారథ్యంలోని డీఎంకే కి 23, విజయ్ కాంత్ కి చెందిన డీఎండీకే కి 20, సీపీఎంకి 10, సీపీఐకి 8, కాంగ్రెస్ కి 5, పీఎంకే , ఎంఎంకెలకు చెరి రెండు, పీటీ, ఫార్వర్డ్ బ్లాక్ లకు చెరో సీటున్నాయి.

జయలలిత సారథ్యంలోని ఏఐడీఎంకే, కరుణానిధి సారధ్యంలోని డీఎంకే మధ్యనే ఇంతకాలమూ ప్రధాన పోటీ కొనసాగుతూ వచ్చింది. ఎంజీఆర్ మరణానంతరం ఈ రెండు పార్టీలు చెరో టర్మ్ చొప్పున పాలిస్తున్నాయి. జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాలంలో కూడా కాంగ్రెస్ తమిళనాడులో ఏదో ఒక ద్రవిడ పార్టీ పంచన చేరి పోటీ చేసేది.

తమిళనాడులోని ఈ రెండు ప్రధాన ద్రవిడ పార్టీలను ఈసారి చిన్న చితకా పార్టీలు కలవరపెడుతున్నాయి. అవి ఇప్పుడు భాగస్వామ్య పార్టీ హోదా ఆశిస్తున్నాయి.

కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న డిఎంకె 20కి పైగా చిన్నచిన్న పార్టీల మద్దతు కూడగట్టింది. అధికార పార్టీ ఏఐడిఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత 7 పార్టీల నేతలతో సమావేశమై, పొత్తు కుదుర్చుకున్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో పది పార్టీలకు ప్రాతినిధ్యం వుంది. వామపక్షాలకు 18 సీట్లుండడం విశేషం.

తమిళనాడులో రాజకీయ పొత్తులు, సమీకరణలు ఎప్పటికప్పుడూ మారుతూ వుంటాయి. 2011లో ఏఐడీఎంకెతో కలిసి పోటీ చేసిన పార్టీలు 2014లో జయలలితకు దూరమయ్యాయి. కొందరు బీజేపీతో పొత్తు పెట్టుకోగా, మరికొందరు ఒంటరిగా బరిలోకి దిగారు. ఆరేడు నెలల క్రితమే పీపుల్స్ వెల్ఫేర్ ఫోరమ్ పేరుతో మరో కొత్త ఫ్రంట్ ఆవిర్భవించింది. ఇందులో సీపీఎం, సీపీఎంతో పాటు వైకో సారథ్యంలోని ఎండీఎంకే, రామదాసు సారథ్యంలోని పీఎంకే , దళితుల్లో పట్టున్న వీసీకే పార్టీలు భాగస్వాములుగా వున్నాయి.

వైకో పార్టీకి 2014 ఎన్నికల్లో 3.5శాతం ఓట్లు లభించాయి. పీఎంకేకి 3 నుంచి 4.5శాతం ఓట్లున్నాయి. 2011 ఎన్నికల్లో సీపీఐ 1.9శాతం ఓట్లు సాధించగా, సీపీఎం 2.4శాతం ఓట్లు సాధించింది. విజయ్ కాంత్ సారధ్యంలోని డీఎండీకేకి గత ఎన్నికలలో 5 నుంచి 8 శాతం ఓట్లు పోలయ్యాయి. 2005లో ఆవిర్భవించిన ఈ పార్టీ 2011లో జయలలితతోనూ, 2014లో బీజేపీతోనూ పొత్తు పెట్టుంది. 2011లో 7.8 శాతం ఓట్లు , 2014లో 5.1 శాతం ఓట్లు లభించాయి. దళితుల్లో పట్టున్న వీసీకే పార్టీకి 1.5శాతం ఓట్లున్నాయి.

 విజయ్ కాంత్ సారథ్యంలోని డీఎండీకే ను కూడా చేర్చుకునేందుకు పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ నేతలు ప్రయత్నిస్తున్నారు. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లోని భాగస్వామ్య పక్షాల ఓట్లన్నీ కలిపితే 15శాతం దాకా వుంటాయి. ఈ లెక్కలే ప్రధాన ద్రవిడ పార్టీలను కలవరపెడుతున్నాయి.

2011 ఎన్నికల్లో ప్రస్తుత వెల్ఫేర్ ఫ్రంట్ లోని పార్టీలతో పొత్తు పెట్టుకున్న జయలలితకు 38.4శాతం ఓట్లు వస్తే, కరుణానిధి పార్టీకి 22.3శాతం ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో దేశమంతా మోడీ గాలి వీస్తే, తమిళనాడులో జయలలితకు తిరుగులేని ఆధిక్యం లభించింది. ఓట్ల శాతం 44.3శాతానికి పెరిగింది.

ఎఐడిఎంకె, డిఎంకె పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా తాము అవతరిస్తామన్న ఆశ పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ లో వుంది. 20శాతం ఓట్లు సాధిస్తే, హంగ్ అసెంబ్లీ ఏర్పడి, కింగ్ మేకర్ లుగానో, కింగ్ లుగానో అవతరిస్తామన్న నమ్మకం ఫ్రంట్ నేతల్లో కనబడుతోంది.

దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీలు జరగబోతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్ధులు ఖరారైతే తప్ప ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు రావచ్చో అంచనా వేసే పరిస్ధితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close