‘పుష్ష’ యాక్ష‌న్ సీన్స్‌కే 40 కోట్లు?!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ సినిమా `పుష్ష‌`. ఈమ‌ధ్యే టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. `త‌గ్గేదే లే..` అంటూ.. బ‌న్నీ త‌న విశ్వ‌రూపం చూపించాడు. త‌న లుక్‌, ఎటిట్యూడ్‌, డైలాగ్ డెలివరీ… అన్నీ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. టీజ‌ర్‌లో ఎక్కువ‌గా యాక్ష‌న్ షాట్సే క‌నిపించాయి. సినిమా కూడా అంతేన‌ట‌. సుకుమార్ తొలిసారి…. త‌న సినిమాల్లో యాక్ష‌న్, ఛేజింగుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం దాదాపుగా 6 యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉండ‌బోతున్నాయి. అందుకోసం ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్న‌ట్టు టాక్‌. అట‌వీ నేప‌థ్యంలో ఓ యాక్ష‌న్ సీన్ ని ఫైట్ మాస్ట‌ర్‌.. పీట‌ర్ హెయిన్స్ ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కించారు. అది ఈ సినిమాకే హైటెల్ గా నిల‌వ‌బోతోంద‌ట‌. ప్రీ క్లైమాక్స్‌కి ముందు, క్లైమాక్స్‌లోనూ మ‌రో రెండు యాక్ష‌న్ సీక్వెన్స్ ఉండ‌బోతున్నాయి. అవి మ‌రో రేంజ్ లోఉంటాయ‌ని స‌మాచారం. ఎక్కువ‌గా రాత్రి పూట షూటింగ్ చేయ‌డం వ‌ల్ల‌, కొత్త త‌ర‌హా కెమెరాలు, ప‌రిక‌రాలు తీసుకురావ‌డం వ‌ల్ల‌.. బ‌డ్జెట్ పెరిగింద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close