జగన్‌కు సాక్షి.. షర్మిలకు ఏబీఎన్.. !

ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి అంటే వైఎస్ కుటుంబానికి అలెర్జీ కంటే ఎక్కువ. ఆ మీడియా సంస్థపై వైఎస్ ఉన్నప్పటి నుండి అనేక రకాలుగా దుమ్మెత్తి పోశారు. వైసీపీ అధినేత నేరుగా ఆ మీడియా సంస్థను నిషేధించింది. తమ పార్టీ నేతలు ఎవరైనా ఆ చానల్‌తో మాట్లాడితే… వారికి ఆ రోజుతో రాజకీయంగా కాలం చెల్లినట్లే అవుతుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు అదే పనిగా ఏబీఎన్‌కు ఇంటర్యూలు ఇస్తున్నారని ఆయనను దూరం పెట్టేశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏబీఎన్‌నే ఇప్పుడు షర్మిలతో పాటు వైఎస్ విజయలక్ష్మికి ప్రధాన మీడియా అయింది. తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిల, విజయలక్ష్మిలకు ఇప్పుడు.. కవరేజీ కావాలంటే ఏబీఎన్‌నే దిక్కు అయింది. ఏబీఎన్‌ను పిలిచి మరీ ప్రత్యేకంగా ఇంటర్యూలు ఇస్తున్నారు.

షర్మిల ఉద్యోగ దీక్ష ఎపిసోడ్‌ ఉద్రిక్తంగా సాగింది. ఇతర మీడియాలు సాయంత్రం వరకూ పట్టించుకోకపోయినా… ఏబీఎన్ మాత్రం ఎప్పటికప్పుడు కవర్ చేసింది. చివరిలో పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా.. పెద్ద ఎత్తున ఏబీఎన్ కవరేజీ ఇచ్చింది. షర్మిల జాకెట్ చినిగిపోయిందని..పోలీసులు అతి చేశారన్న విషయాన్ని..అలాగే లీడర్లతో పాటు విజయలక్ష్మి స్పందనను కూడా వెంటనే ప్రసారం చేసింది. షర్మిల దీక్షా శిబిరం వద్ద.. ఏబీఎన్‌కు ప్రత్యేక ట్రీట్మెంట్ లభిస్తోంది. అదే సాక్షిని మాత్రం దూరం పెడుతున్నారు. కవరేజీ ఇవ్వని దానికి ఎందుకు కెమెరాలు అడ్డం పెడుతున్నారని షర్మిల కసురుకోవాల్సి వచ్చింది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. మిత్రులు ఉండరు. అందుకే రాజకీయ ప్రత్యర్థుల్ని ఎప్పుడూ వ్యక్తిగత శత్రువులుగా చేసుకోకూడదు. కానీ… వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా చూస్తే… వెంటాడుతున్నారు. ఇప్పుడు…వైసీపీ గౌరవాధ్యక్షురాలికి ఏబీఎన్ ఎక్కడా లేని ప్రాచుర్యం ఇస్తోంది. అదే రాజకీయాల్లో ఉండే మలుపుల్ని మరోసారి చూపించినట్లయింది. ఇది ముందు ముందు ఎలాంటి మార్పులకు కారణం అవుతుందో వేచి చూడాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close