గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానంలో కేంద్రం మార్పులు చేసింది. ఈ సంస్కరణల్లో భాగంగా, లగ్జరీ ఇళ్లు , ఇతర లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో, ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్ విభాగంలో పెద్ద మార్పులను తీసుకురానుంది. లగ్జరీ ఇళ్లు అంటే ఏమిటి అనేది చాలా మందికి వచ్చే డౌట్.
జీఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసుల ప్రకారం, లగ్జరీ ఇళ్లు అంటే 15 కోట్ల రూపాయలకు పైబడి విలువ కలిగిన ఆస్తులు. ఈ ఆస్తులు సాధారణంగా ప్రీమియం స్థానాల్లో, ఉన్నత స్థాయి సౌకర్యాలతో, దిగుమతి చేసుకున్న ఫిట్టింగ్‌లు, ఫినిషింగ్‌లు , ప్రత్యేకమైన డిజైన్ లతో నిర్మించినవి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోని హై-ఎండ్ అపార్ట్మెంట్లు, విల్లాలు లేదా పెంట్‌హౌస్‌లు ఈ జాబితాలోకి వస్తాయి.
రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, లగ్జరీ ఇళ్లు సాధారణంగా అల్ట్రా-ప్రీమియం ఫీచర్లు కలిగి ఉంటాయి. వీటిలో స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, దిగుమతి చేసుకున్న మార్బుల్ ఫ్లోరింగ్, డిజైనర్ కిచెన్లు, ప్రైవేట్ పూల్స్, హోమ్ థియేటర్లు , ఇతర ఖరీదైన సౌకర్యాలు ఉంటాయి. ఈ ఇళ్లు ధనవంతులైన కొనుగోలుదారులను ఆకర్షించేందుకు నిర్మిస్తారు.
లగ్జరీ ఇళ్ల కొనుగోలుదారులు ఈ కొత్త పన్ను నిర్మాణం వల్ల ఏర్పడే ధరల పెంపు ఉండకూడదంటే… కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. “రెడీ-టు-మూవ్ ఇళ్లను ఎంచుకోవడం లేదా రా అపార్ట్మెంట్లను కొనుగోలు చేసి, ఫిట్టింగ్‌లను స్వయంగా ఎంచుకోవడం వంటివి చేసుకోవచ్చు.