ఈ తిప్పలన్నీ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికేనా?

చండీయాగం దిగ్విజయంగా పూర్తి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్పి దృష్టి కేంద్రీకరించినట్లున్నారు. ఇంతవరకు తమ పార్టీతో స్నేహంగా ఉంటున్న మజ్లీస్ పార్టీతో కూడా ఈ ఎన్నికలలో పొత్తులు పెట్టుకోకూడదని నిశ్చయించుకొన్నారు కనుక ముస్లిం ఓట్లకు గాలం వేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక చేప్పట్టినట్లున్నారు.

ఈరోజు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న చంచల్ గూడ జైలు, రేస్‌కోర్సులను వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ ముస్లింల కోసం పాఠశాలలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వచ్చే ఏడాది జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం విద్యార్ధుల కోసం ఏకంగా 60 రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల నిర్వహణ బాధ్యతను విద్యాశాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మైనార్టీ పాఠశాలలలో కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే విద్యా భోధన జరగాలని నిర్ణయించారు. ఈ 60 పాఠశాలలలో బాలురకి, బాలికలకి చెరో 30 చొప్పున కేటాయించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ మైనార్టీ పాఠశాలలలో భోధన, భోధనేతర సిబ్బంది నియామకాల కోసం కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ ఈ నిర్ణయాన్ని జి.హెచ్.ఎం.సి. ఎన్నికల తరువాత తీసుకొని ఉండి ఉంటే ఎవరూ ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేసేవారు కాదు. కానీ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ నిర్ణయాలు తీసుకొన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తే అసజహమేమీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com