ఐసిస్ ఉగ్రవాదులకు టర్కీ ఆర్ధిక సహాయం?

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులకు టర్కీ ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాదీమిర్ పుతీన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. తమ యుద్ద విమానాన్ని టర్కీ వాయుసేనలు కూల్చివేసినందుకు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రష్యా, అందుకు టర్కీ తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించింది. హెచ్చరించడమే కాదు…తక్షణమే కార్యాచరణలో దిగింది కూడా. సిరియాలో తన వైమానిక స్థావరాల వద్ద విమాన విద్వంసక క్షిపణులను మోహరించింది. అంటే అవకాశం చిక్కితే టర్కీ యుద్ద విమానాలను కూల్చేందుకు రష్యా సిద్దమయిందని భావించవచ్చును. అలాగే టర్కీ నుండి రష్యా దిగుమతి చేసుకొంటున్న ఆహారపదార్ధాలు, అనేక ఇతర వస్తువులను తీసుకోవడం నిలిపివేసిందని వార్తలు వస్తున్నాయి. టర్కీకి చెందిన ఏ ఉత్పత్తినీ తాము కొనబోమని రష్యా ప్రజలు చెపుతున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతీన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ టర్కీపై చాలా తీవ్ర ఆరోపణలు చేసారు. “సిరియాలోని ఉగ్రవాదుల అధీనంలో ఉన్న చమురు బావుల నుండి టర్కీ వేలాది బ్యారల్స్ చమురు కొనుగోలు చేస్తోంది. ఆ డబ్బుతోనే ఉగ్రవాదులు ఆయుధాలు సమకూర్చుకొని వివిధ దేశాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ సంగతి టర్కీకి తెలిసి ఉన్నప్పటికీ ఉగ్రవాదుల నుండి నిత్యం భారీగా చమురు కొనుగోలు చేస్తూ వారికి ఆర్ధికంగా సహాయపడుతోంది. సిరియాలో ఉగ్రవాదుల అధీనంలో ఉన్న చమురు బావుల వద్ద నుండి చమురు తీసుకొని వెళుతున్న వాహనాలు టర్కీలోకి వెళుతుండటం పై నుండి తమ యుద్ద విమానాలు గమనిస్తూనే ఉన్నాయి. టర్కీ ఉగ్రవాదుల నుండి చమురు ఒకటే కాదు మా దేశ ప్రజల రక్తాన్ని కూడా కొంటోందని మేము భావిస్తున్నామని” పుతీన్ అన్నారు.

“మా విమానాన్ని కూల్చివేసినందుకు టర్కీ క్షమాపణ చెపుతుందని మేము ఎదురుచూస్తుంటే, అది రోజుకొక మాట మాట్లాడుతూ మమ్మల్ని ఇంకా రెచ్చగొడుతోంది. మా యుద్ద విమానం దాని గగనతలంలో ప్రవేశించినందుకే కూల్చి వేశామని మొదట చెప్పిన టర్కీ ఇప్పుడు అది మా యుద్ద విమానం అని తెలియక పొరపాటున కూల్చి వేశామని చెప్పడం చూస్తుంటే అది ఏవిదంగా మాట మార్చుతోందో అర్ధమవుతోంది. మా యుద్ద విమానంపై స్పష్టంగా మాదేశ చిహ్నాలు ఉన్నాయి. మా విమానం ఎప్పుడు, ఏ దిశలో, ఎంత ఎత్తులో ప్రయాణిస్తోందో, దానిని టర్కీ కూల్చివేసినపుడు అది సరిగ్గా ఏ ప్రాంతంలో ఉందో అన్ని వివరాలు అమెరికాకి ఖచ్చితం తెలుసు. అయినా అది టర్కీ తప్పు చేయలేదని వాదిస్తోంది. ఉగ్రవాదంపై ఒకరు పోరాడుతుంటే మరొకరు ఉగ్రవాదులకు అండగా నిలబడుతుంటే ఎప్పటికయినా ఉగ్రవాదాన్ని అంతం చేయగలమా? చేయలేకపోతే ఏమవుతుందో వాళ్ళే ఆలోచించుకోవాలి,” అని పుతీన్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close