జనరేటర్‌లు, ఇన్వర్టర్‌ల బిజినెస్ పడిపోయింది: కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశమంతా అబ్బురపడేలా నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. కేటీఆర్ ఇవాళ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధివల్లే రాష్ట్రంలో 24 గంటలపాటు విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగుతోందని కేటీఆర్ అన్నారు. గతంలో ఎండాకాలం వస్తే ఎడాపెడా కరెంట్ కోతలు ఉండేవని, ఒక్కో అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవాళ్ళు జనరేటర్‌లు నడపటంకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేవారని అన్నారు. కానీ ఇవాళ జనరేటర్లు, ఇన్వర్టర్ల బిజినెస్ పడిపోయిందని చెప్పారు. ప్రజలకు లక్షల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం వచ్చిందన్నారు.

సీఎమ్ ప్రణాళిక చాలా పెద్దగా ఉందని, ఆయన హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని చెప్పారు. హైదరాబాద్ నగర భద్రతను లక్ష సీసీ టీవీ కెమేరాల ద్వారా కట్టుదిట్టం చేయబోతున్నట్లు తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. సమైక్య పాలనలో హైదరాబాద్ నిరాదరణకు గురైందని చెప్పారు. ప్రజల దాహార్తిని తీర్చటానికి సరైన జలాశయం ఒక్కటికూడా నిర్మించలేదని, వారికి ముందు చూపులేకపోవటంవల్లే ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. నగర మంచినీటి అవసరాలు తీర్చేందుకు 30 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంకల్పంవల్ల, ముఖ్యమంత్రి పట్టుదల వల్ల గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తీసుకురాగలిగామని అన్నారు. ఇంకో నాలుగైదు రోజులలో శివారు ప్రాంతాలలో, నగరంలో తాగునీటి సమస్యలు తొలగిపోతాయని చెప్పారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close