ఏపిలో రూ.85,350 కోట్లతో రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి హామీ

ఈరోజు విజయవాడలోని బెంజి సర్కిల్ మరియు దుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్లకు శంఖుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారి, ఈ కార్యక్రమానికి హాజరయిన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “విజయవాడ చుట్టూ 180 కిమీ పొడవుగల ఒక ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. దానికి సుమారు రూ. 20,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే రాష్ట్రంలో కొత్తగా 1,350 కిమీ జాతీయ రహదారులను నిర్మించాలని కోరారు. దానికి రూ. 65,000 కోట్లు ఖర్చవుతుంది. అలాగే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా కేంద్రప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ ప్రతిపాదనలన్నిటికీ నేను ఆమోదం తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. రాష్ట్రాన్ని త్వరగా అభివృద్ధి చేసుకోవాలని తపిస్తున్నారు. పైగా ఆయన మా ప్రభుత్వానికి చాలా మంచి స్నేహితుడు. అందుకే ఆయన ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులన్నీ నేను తక్షణమే ఆమోదిస్తున్నాను. హైవేల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపి, అది కేంద్రప్రభుత్వం ఆమోదించేలోగా రాష్ట్రంలో భూసేకరణ కార్యక్రమం పూర్తి చేసినట్లయితే మేము వచ్చే ఏడాది డిశంబర్ నుండి జాతీయ రహదారుల నిర్మాణం మొదలుపెట్టగలము,” అని గడ్కారీ అన్నారు.

ఈరోజు గడ్కారీ ప్రకటించినవన్నీ కలిపి చూసినట్లయితే మొత్తం రూ.85, 350 కోట్లు అయ్యింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి నేటి వరకు రాష్ట్రానికి ఒకేసారి ఇంత భారీగా నిధులు మంజూరు చేయలేదు. ఇంకా అనేక ప్రాజెక్టులకు, ముఖ్యంగా అమరావతి నిర్మాణం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం మున్ముందు చాలా భారీ మొత్తాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు హైలైట్ చేసుకోగలిగితే బీజేపీ పట్ల ప్రజలలో నెలకొన్న అపోహలు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎంతగా రెచ్చ గొట్టినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయమనం కోల్పోకుండా కేంద్రంతో మంచిగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు సాధించుకోగలుగుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి గల వ్యక్తి…మాకు చాలా మంచి స్నేహితుడని చెప్పడానికి కారణం అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close