”శ్రీ మేఘ స్టూడియో” ప్రారంభం

ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌లను లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ..శ్రీ మేఘ స్టూడియో రూపుదిద్దుకుంది. ఈ స్టూడియోను ప్రముఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సుమన్‌, అనగనగ ఒక చిత్రం మూవీ హీరో శివ, హీరోయిన్‌ మేఘశ్రీ, ప్రముఖ నిర్మాత సతీష్‌ కొండ్రెడ్డి, నవీన్‌ యాదవ్‌, పద్మిని, టెక్నికల్‌ హెడ్‌ మహి.కె.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ మేఘ స్టూడియో అధినేత వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ..”ఎంతో చరిత్ర ఉన్న మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేను అల్రెడీ మేనేజర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈ స్టూడియోను ఆధునిక హంగులతో ప్రారంభించడం జరిగింది. నా మిత్రుడు కొండ్రెడ్డి సతీష్‌ నిర్మాతగా రూపొందిస్తున్న ‘వాడు వీడు ఓ కల్పన’ చిత్ర పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో శ్రీకారం చుడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ఆహ్వానాన్ని మన్నించి..మా స్టూడియోని ప్రారంభించిన మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారికి, అలాగే ఇక్కడకు విచ్చేసిన నవీన్‌యాదవ్‌, సుమన్‌గార్లకి మరియు అనగనగా ఒక చిత్రం చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..” అన్నారు.

ఇంకా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారంతా..ఈ స్టూడియో మంచి అభివృద్ది పథంలో కొనసాగాలని ఆకాంక్షించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

సుకుమార్‌ని మోసం చేసిన దిల్ రాజు

సుకుమార్ సినిమా అంటే లాజిక్కుతో పాటు, ఐటెమ్ పాట‌లు గుర్తొస్తాయి. 'అ అంటే అమ‌లాపురం' ద‌గ్గ‌ర్నుంచి ఆయ‌న ప్ర‌భంజ‌నం మొద‌లైంది. 'ఊ అంటావా..' వ‌ర‌కూ అది కొన‌సాగుతూనే ఉంది. నిజానికి సుకుమార్‌కు ఐటెమ్...

కిసాన్ సమ్మాన్ కు కొర్రీలు..10 లక్షల మందికి సాయం బంద్..!?

రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తూనే అందుకు విరుద్దంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ కోతలకు గురి అవుతోంది. ఈ పథకానికి అనేక కొర్రీలు పెడుతూ...

‘ఆర్య‌’ వెనుక వినాయ‌క్‌

ప్రేమ క‌థ‌ల్లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిన సినిమా 'ఆర్య‌'. ఈ సినిమా విడుద‌లై 20 ఏళ్లు పూర్తయ్యింది. అయినా ఇప్పుడు చూసినా 'ఆర్య‌' కొత్త‌గానే క‌నిపిస్తుంది. దానికి కార‌ణం.. సుకుమార్ రైటింగ్‌, మేకింగ్‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close