ఢిల్లీలో డీజెల్ వాహనాలపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు

హైదరాబాద్: ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఇవాళ సంచల తీర్పు వెలువరించింది. 2 లీటర్ల కంటే ఎక్కువ పరిమాణం గల ఇంజన్లు ఉన్న ఎస్‌యూవీ, లగ్జరీ నూతన వాహనాలను మార్చి 31వరకు రిజిస్ట్రేషన్ చేయొద్దని అధికారులను ఆదేశించింది. పదేళ్ళకంటే ఎక్కువ వయసున్న డీజెల్ వాహనాలను రోడ్లపైకి అనుమతించొద్దని కూడా నిర్దేశించింది. ఈ ఆదేశాలు టయోటా ఇన్నోవా, మహేంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, టాటా సఫారీ, సుమో, మిత్సుబిషి పెజేరో, ఫోర్డ్ ఎండీవర్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ వాహనాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ వాహనాలన్నీ రెండు లీటర్లపైనే పరిమాణంగల ఇంజన్లున్నవే. ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం పెరిగిపోవటం, దీనిని నియంత్రించటంకోసం కేజ్రీవాల్ ప్రభుత్వం జనవరి 1 నుంచి సరి సంఖ్య వాహనాలు, బేసి సంఖ్య వాహనాలు రోజు విడిచి రోజు రోడ్లపైకి వచ్చేటట్లుగా ఆదేశాలు జారీచేయటం తెలిసిందే. దీనికితోడు నిన్న సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం కూడా ఢిల్లీలో వాయు కాలుష్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలోని గాలిని కాలుష్యం చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాహనాలను ధనవంతులు కొనుగోలు చేయనీయకూడదని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ప్రస్తుతం 85 లక్షల వాహనాలు ఉన్నాయి… ప్రతిరోజూ 1,400 కొత్త కార్లు రోడ్లపైకి వచ్చిచేరుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close